‘డ్యూటీ’ కోసం పేరు మార్చుకున్న హీరో రవితేజ.. ఇది మామూలు ప్లాన్ కాదుగా!

బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘ ప్రయాణం సాగించిన తర్వాత సోలో హీరోగా మారాడు రవితేజ. ఆరంభంలోనే విభిన్నమైన యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇలా కష్టనష్టాలను అనుభవించిన తర్వాత స్టార్‌గా మారిన రవితేజ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కెరీర్ పరంగానూ హిట్లు ఫ్లాపులను బేరీజు వేయకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవా చూపిస్తున్నాడు. దీంతోపాటు మాస్ ఆడియెన్స్‌కు చేరువగా ఉండే సినిమాలనే ఎక్కువగా చేస్తున్నాడు.

ఆ మధ్య కొన్నేళ్ల పాటు మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మొదట్లో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి విజయాల బాట పట్టాడు. ఇది అతడికి సక్సెస్‌ను అందించడమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపింది. దీంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ అనిపించుకుంది. ఈ ఉత్సాహంతోనే రవితేజ ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను చేశాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశనే ఎదుర్కొంటోంది. ఇది విడుదలై రెండు వారాలు ముగిసినా కేవలం సగం బిజినెస్‌ను మాత్రమే రాబట్టగలిగింది.

ఇదిలా ఉండగా.. రవితేజ గత ఏడాది పలు చిత్రాలను ప్రారంభించాడు. అందులో 'రామారావు ఆన్ డ్యూటీ' ఒకటి. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఆరంభం నుంచే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చాలా వరకూ చిత్రీకరణ కూడా జరిగింది. సందేశాత్మక కథతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమా నుంచి అప్‌డేట్లు కావాలని రవితేజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రవితేజ తన పేరును మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Ravi Teja Changes Name for Ramarao On Duty Movie

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాకు సంబంధించిన టీజర్‌ను కొద్ది రోజుల్లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు శరత్ ఇటీవలే వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ తన ట్విట్టర్ ఖాతాలో యూజర్ నేమ్‌ను మార్చుకున్నాడు. దీంతో ఇన్ని రోజులూ Ravi Tejaగా మాత్రమే ఉన్న అతడి పేరు.. ఇప్పుడు Ravi Teja On Dutyగా మారిపోయింది. ఈ సినిమాను ఇప్పటి నుంచే ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్టార్ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రమోషన్ కోసం పేరు మార్చుకోవడంతో అతడి ప్లాన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

సందేశాత్మక కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాస్ మహారాజా రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రంలో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మార్చి 25న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X