రవితేజ నుంచి ఇది ఊహించి ఉండరు.. యంగ్ హీరోలు కూడా చేయని రీతిలో.!

స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఐదు పదుల వయసులోనే ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా చేసే రవితేజ.. ఈ మధ్య కొంచెం స్పీడు తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. అదే 'డిస్కోరాజా'.

డిస్కోరాజా అంటూ వస్తున్నాడు

డిస్కోరాజా అంటూ వస్తున్నాడు

రవితేజ ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌‌ఆర్‌‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరకర్త. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

 సినిమాను కన్ఫార్మ్ చేసిన యంగ్ డైరెక్టర్

సినిమాను కన్ఫార్మ్ చేసిన యంగ్ డైరెక్టర్

ఇక, ఈ సినిమా తర్వాత అతడు చేయబోయే దానిపై క్లారిటీ అయితే లేదు. కానీ, తాజాగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాత్రం తనతోనే సినిమా చేస్తున్నారంటూ ప్రకటించాడు.‘నేను నాగార్జున గారితో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయనకు నేనే ఎటువంటి కథనూ వినిపించలేదు. అసలు మా మధ్య అటువంటి చర్చలు కూడా జరగలేదు. కానీ, నేను త్వరలోనే ఓ రవితేజ గారితో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలు కొద్దిరోజుల్లో వెల్లడిస్తాము' అని తెలిపాడు.

అతడికి మరో ఛాన్స్

అతడికి మరో ఛాన్స్

ఇక, ఈ సినిమా తర్వాత రవితేజ ‘రణరంగం' దర్శకుడు సుధీర్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడంటూ తాజాగా వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మాస్ హీరో పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. వాస్తవానికి రణరంగం కూడా రవితేజ చేయాల్సి ఉంది. కానీ, శర్వానంద్ కోసం త్యాగం చేశాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రవితేజ.. సుధీర్‌కు మరో అవకాశం ఇచ్చాడని సమాచారం. ఒక సినిమా పట్టాలపై ఉండగానే రవితేజ.. రెండు సినిమాలు ఓకే చేయడం సినీ పెద్దలను విస్మయానికి గురి చేస్తోంది.

మహాసముద్రం లైట్ తీసుకున్నాడా.?

మహాసముద్రం లైట్ తీసుకున్నాడా.?

‘RX100' దర్శకుడు అజయ్ భూపతితో మాస్ మహరాజ రవితేజ ‘మహాసముద్రం' అనే సినిమా చేయనున్నాడని ఎప్పటి నుంచో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను మల్టీ స్టారర్‌గా తెరకెక్కించనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమాను ఆయన చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంతోనే అది స్పష్టమైందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X