Khiladi: రవితేజకు కోలుకోలేని షాక్.. రిలీజ్ రోజే ఫుల్ మూవీ లీక్.. ఆ సైట్లలో డౌన్‌లోడ్ లింక్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆ తర్వాత ఎన్నో కష్టాల తర్వాత హీరోగా మారాడు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్తున్నాడు.

ఇక, కొంత కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయిన రవితేజ.. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'క్రాక్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే రవితేజ ఇప్పుడు 'ఖిలాడి' అనే సినిమాతో వచ్చాడు. శుక్రవారమే విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన గంటల్లోనే లీకైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

 ఖిలాడిగా వచ్చిన మాస్ మహారాజా

ఖిలాడిగా వచ్చిన మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'ఖిలాడి'. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

భారీ రెస్పాన్స్‌.. అంచనాలు కూడా

భారీ రెస్పాన్స్‌.. అంచనాలు కూడా

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఖిలాడి' నుంచి కొద్ది రోజుల క్రితమే టీజర్‌ను విడుదల చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. అలాగే, ఈ సినిమా నుంచి కొన్ని పాటలను వదలగా వీటికి అన్ని వర్గాల్లో అదిరిపోయే స్పందన దక్కింది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు నమోదు చేసింది.

ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

మాస్ హీరో రవితేజ 'ఖిలాడి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 21.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 24.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రవితేజ మూవీకి ఊహించని టాక్

రవితేజ మూవీకి ఊహించని టాక్

మాస్ మహారాజా రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'ఖిలాడి'. భారీ అంచనాల నడుమ ఈ యాక్షన్ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఇది గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్లా ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ దక్కింది.

కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం

కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం

'ఖిలాడి' మూవీ రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో భారీ రేంజ్‌లో తెరకెక్కడంతో అన్ని చోట్లా భారీ స్థాయిలో విడుదలైంది. దీంతో ఈ సినిమాను మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనిపించాయి. అయితే, దీనికి టాక్ తేడాగా రావడంతో వసూళ్లపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఖిలాడి టీమ్‌కు కోలుకోలేని దెబ్బ

ఖిలాడి టీమ్‌కు కోలుకోలేని దెబ్బ

రవితేజ నటించిన 'ఖిలాడి' మూవీ ఎన్నో అంచనాలతో, భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. దీంతో ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవడంతో పెద్ద దెబ్బ తగిలింది.

 ఆన్‌లైన్‌లో ఖిలాడి మూవీ లింక్స్

ఆన్‌లైన్‌లో ఖిలాడి మూవీ లింక్స్

సుదీర్ఘ కాలంగా పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'ఖిలాడి' మూవీని కూడా లీక్ చేసేశాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని గంటల్లోనే డౌన్‌లోడ్ లింక్‌ను కూడా పెట్టేశాయి. దీని ప్రభావం మూవీ కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపించే ప్రమాదం కూడా ఉందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X