రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: మరో సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్న మాస్ మహారాజా

అవకాశాల కోసం ఎదురు చూసీ చూసీ.. చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్‌ను ఆరంభించాడు మాస్ మహారాజా రవితేజ. ఇలా చాలా సినిమాల్లో నటించిన అతడు.. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ టాలెంటెడ్ హీరో.. ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న ఈ సీనియర్ హీరో.. ఈ సంక్రాంతికి వచ్చిన 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి తన స్టామినా తగ్గలేదని నిరూపించాడు.

'క్రాక్' విజయంతో మాంచి జోష్ మీదున్న రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లిమ్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం.. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న 'ఖిలాడీ' టీజర్ విడుదల కాబోతుందట. ఇక, ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఫోటోలు: బెంగాలీ భామ బోల్డ్ ఫోటోషూట్ మీరు ఎప్పుడూ చూడని పిక్స్

Ravi Tejas Khiladi Teaser Release Date Fix

'ఖిలాడీ' మూవీ సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటిస్తున్నట్లు ఆ మధ్య చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X