వాటిని చాలా మిస్ అవుతున్నాడట.. రవితేజ స్టన్నింగ్ స్టిల్స్
మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేసేస్తున్నాడు. వ్యక్తిగత విషయాలను, తన పెట్ చేసే అల్లరి, పిల్లలు చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కిక్ ఇస్తున్నాడు. లాక్ డౌన్‌లో ఫ్యామిలీతో ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఇంటి పట్టునే ఉన్న హీరోకు షూటింగ్ చేయాలన్న బెంగపట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి పట్టునే ఉంటూ బాగా బోర్ కొట్టినట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్‌లో కండలు పెంచుతూ అందర్నీ ఆశ్చర్యపరిచిన రవితేజ్ ఈ వయసులోనూ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ దుమ్ములేపాడు. తన జిమ్ ఏరియాలో ఎంతలా కష్టపడుతున్నాడో తెలిపే వీడియోను కూడా షేర్ చేశాడు. ఇక సినిమాల పరంగా రవితేజ కొన్నేళ్లుగా నిరాశ పరుస్తూ వస్తున్నాడు. చివరగా రాజా ది గ్రేట్ సినిమాతో సక్సెస్ కొట్టాడు. ఆపై చేసిన సినిమాలన్నీ మిశ్రమ ఫలితాన్ని మిగిల్చాయి.

ప్రస్తుతం రవితేజ, అతని అభిమానులు క్రాక్ సినిమాపైనే అశలు పెట్టుకున్నారు. డాన్ శీను, బలుపు వంటి సక్సెస్‌ల తరువాత గోపీచంద్ మలినేనితో చేస్తోన్న చిత్రం కావడంతో క్రాక్ పై భారీగానే అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టు ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ అదిరిపోయింది. ఈ లాక్డౌన్ వల్ల వాయిదా పడ్డ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోన్నట్టు రవితేజ ప్రకటించాడు. షూటింగ్స్ మిస్ అవుతున్నా.. క్రాక్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని కొన్ని ఫోటోలను రవితేజ షేర్ చేయగా అవి ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











