పవన్ కల్యాణే కాదు.. ఆ సినిమాని రవితేజ కూడా పక్కన పెట్టేశాడు, దసరాకి కొత్తగా!
తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తేరి చిత్రాన్ని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలుగులో రీమేక్ చేయాలని భావించాడు. మొదటగా ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తాడని అంతా భావించాడు. కానీ అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ పాలిటిక్స్ తో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
ఆ తరువాత రవితేజ ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మైత్రి మూవీస్ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారని కూడా ప్రచారం జరిగింది. తాజగా ఈ ప్రాజెక్ట్ పై రవితేజ మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీమేక్ చిత్రాలు చేయడం రిస్క్ అని రవితేజ భావిస్తున్నాడట.

అందుకే కొత్త కథ సిద్ధం చేయమని సంతోష్ శ్రీనివాస్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలే సంతోష్ శ్రీనివాస్ వినిపించిన కథ నచ్చడంతో రవితేజ ఒకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అన్ని కుదిరితే ఈ చిత్రం దసరాకు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











