రవితేజ బర్త్ డే గిఫ్ట్.. టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్!
మాస్ మహారాజ రవితేజ ప్రభావం క్రమంగా ఆడియన్స్ లో తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి కారణం రవితేజ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. ఈ పరిస్థితి కంట్రోల్ లోకి రావాలంటే రవితేజకు వెంటనే భారీ హిట్ అందుకోవాలి. కమర్షియల్ చిత్రాలు వర్కౌట్ కాకపోవడంతో రవితేజ కథాబలం ఉండే చిత్రాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. త్వరలో రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలీసీనే.
తాజా సమాచారం ప్రకారం జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విఐ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ గత చిత్రాలు టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోని తీవ్రంగా నిరాశపరిచాయి.

విఐ ఆనంద్ తెరకెక్కించే చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ ప్రచారం జరుగుతోంది. నాభ నటేష్, పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎంపికయ్యారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనుండగా, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











