సైంటిఫిక్ థ్రిల్లర్‌తో రవితేజ ప్రయోగం.. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్!
మాస్ మహారాజ రవితేజ ప్రయోగాల బాట పట్టాడు. రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తున్న సంగతి తేలింది. రవితేజ మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వైవిధ్యంగా ఉండబోతోంది. రవితేజ తదుపరి నటించే చిత్రం కూడా పూర్తి స్థాయి ప్రయోగాత్మకంగా ఉండబోతోంది. అమర్ అక్బర్ ఆంటోని తరువాత రవితేజ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ విఐ ఆనంద్ దర్శత్వంలో నటించబోతున్నాడు.
అతీంద్రీయ శక్తుల అంశంతో సినిమాలు తీయడంలో విఐ ఆనంద్ సిద్ధహస్తుడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం చిత్రాలు ఆ తరహాకి చెందినవే. రవితేజతో తెరక్కించబోయే చిత్రం కూడా సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో ప్రయోగాత్మకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ హీరోయిన్ గా నభా నటేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన నన్ను దోచుకుందువటే చిత్రంలో నభా నటేష్ ఆకట్టుకుంది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రం పూర్తి కాగానే రవితేజ తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.


Click it and Unblock the Notifications











