మూడు ముక్కల్లో రవితేజ.. అంతా ఉత్తుత్తేనా!
మాస్ మహారాజ రవితే నటిస్తున్న తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. తనకు అచ్చొచ్చిన శ్రీనువైట్ల దర్శత్వంలో రవితేజ చాలా కాలం తరువాత నటిస్తున్నాడు. దీనితో ఈ చిత్రంలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
రవితేజ పాత్ర గురించి క్లూ ఇస్తూ మూడు పేక ముక్కల్లో హిందూ ముస్లిం, క్రిస్టియన్ గా రవితేజని చూపించారు. ఈ ఫస్ట్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచింది. రవితేజ ఈ చిత్రంలో ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నాడని అంతా భావించారు. తాజగా జరుగుతున్న సమాచారం ప్రకారం రవితేజ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయడం లేదట.

ఒక్క రవితేజనే ముగ్గురిగా నటిస్తాడట. అంటే అపరిచితుడు టైపు. అపరిచితుడు చిత్రంలో లాగే ఈ చిత్రంలో కూడా రవితేజ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తో భాదపడే వ్యక్తిగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. సినిమా విడుదలయ్యేవరకూ ఇలాగె సస్పెన్స్ కొనసాగిస్తారేమో. చాలా కాలం తరువాత నడుము సుందరి ఇలియానా ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.


Click it and Unblock the Notifications











