మాస్ రాజాను తక్కువ అంచనా వేశారు.. క్రాక్‌తో బడా ప్రొడ్యూసర్స్ మైండ్ బ్లాక్

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది పర్మినెంట్ కాదని స్టార్స్ అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ సక్సెస్ ఎప్పుడు ఎండ్ అవుతుందనే విషయం మాత్రం ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తే గాని అర్థం కాదు. ఇక కెరీర్ లో ఎన్నో జయాపజయాలను లెక్క చేయకుండా వస్తున్న రవితేజ మొన్నటి వరకు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పలేదు. ముఖ్యంగా అపజయాలు ఒక రేంజ్ లో వచ్చాయి. అయితే క్రాక్ తో ఒక్కసారిగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు మాస్ రాజా.

Recommended Video

Ravi Teja Krack Movie To Enter Profit Zone Soon
క్రాక్ కంటే ముందు..

క్రాక్ కంటే ముందు..

సక్సెస్ లో ఉన్నప్పుడు ఎవరైనా అవసరం కోసం ఎంతో ప్రేమగా మాట్లాడతారు. ఇక సినిమా ఇండస్ట్రీలో నిత్యం బిజినెస్ ఆలోచనలతో ఉండే కొందరు నిర్మాతలు హీరోలు ఫామ్ లో ఉంటే ఆకాశానికి ఎత్తేయడం కూడా కామన్. ప్లాప్ లో ఉంటే మాత్రం మళ్ళీ తిరిగి కూడా చూడరు. ఇక మాస్ రాజా క్రాక్ సినిమా కంటే ముందు కొందరు నిర్మాతలు ఇచ్చిన కమిట్మెంట్ ను క్యాన్సిల్ చేసిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి.

ఆ సినిమాలతో భారీ దెబ్బ

ఆ సినిమాలతో భారీ దెబ్బ

రవితేజ రాజా ది గ్రేట్ అనంతరం మళ్ళీ ఫామ్ లోకి రావడంతో ఒక్కసారిగా ఆఫర్స్ రావడం కూడా మొదలయ్యాయి. అయితే ఆ తరువాత చేసిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ముఖ్యంగా అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు అయితే నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.

ఇచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి..

ఇచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి..

అయితే అదే సమయంలో రెండు సినిమాల నిర్మాతలు రవితేజతో ముందు చేసుకున్న అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారట. ఇక మరికొందరు ఇచ్చిన అడ్వాన్సులను కూడా వెనక్కి తీసుకున్నట్లు కూడా ఫిల్మ్ నగర్ లో టాక్ వచ్చింది. అందులో బడా నిర్మాతలు కూడా ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి.

ఇచ్చింది తీసుకుంటేనే..

ఇచ్చింది తీసుకుంటేనే..

గీత ఆర్ట్స్ కు సంబంధించిన GA2 అలాగే యూవీ క్రియేషన్స్ వంటి సంస్థలు రవితేజతో ఒక సినిమాను నిర్మించాలని అనుకున్నాయి. అయితే రవితేజ గత సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ ను కూడా వాళ్ళు ఇవ్వలేమని చెప్పారట. అడిగినంత ఇవ్వలేమని ఇచ్చింది తీసుకుంటేనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పినట్లు టాక్ వచ్చింది. కానీ మాస్ రాజా ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.

రవితేజ స్థానంలో గోపిచంద్

రవితేజ స్థానంలో గోపిచంద్

మారుతి దర్శకత్వంలోనే రవితేజ సినిమాను నిర్మించాలని అనుకున్నారట. ఈ కాంబోపై అప్పట్లో కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఇక ఫైనల్ గా యూవీ క్రియేషన్స్ హీరో గోపిచంద్ ను ట్రాక్ లోకి తెచ్చి మారుతి సినిమాకు ఫిక్స్ చేసినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని క్రాక్ సినిమాతో మాత్రం రవితేజ మైండ్ బ్లాక్ చేసేలా హిట్ అందుకున్నాడనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X