Ramarao on Duty Teaser: ఆయుధంలా బ్రతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువు ఉంటుంది

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా జయాపజయాలను ఏమాత్రం లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. రవితేజ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత త్వరగా ఫినిష్ అయ్యే విధంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. నిర్మాతలపై ఎక్కువ భారం పడకుండా ఏ సినిమా అయినా సరే అనుకున్న సమయానికంటే ముందే అయిపోయే విధంగా తీరికలేకుండా కష్ట పడుతూ ఉంటాడు. అందుకే చాలా మంది నిర్మాతల రవితేజ తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాపైనే ఉంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్నప్పటికీ రవితేజ కటౌట్స్ అయితే సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సరికొత్త మాస్ యాక్షన్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అనిపిస్తోంది.

ఇక నేడు మహాశివరాత్రి సందర్భంగా సినిమాకు సంబందించిన మొదటి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో రవితేజ చాలా పవర్ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండు చేతులతో సంతకాలు పెడతూ మంచి కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్ పాత్రలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో జీవించి నటిస్తారు అని చెప్పవచ్చు. ఇక రామారావు సినిమాలు కూడా ఒక మంచి ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నాడు. టీజర్ లో రవితేజ డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.

 Ravi teja Ramarao on Duty telugu Teaser released

'ఆయుధం మీద ఆధారపడే నీ లాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ్రతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువు ఉంటుంది' అని రామారావు పాత్రలో మాస్ రాజా చెబుతున్న డైలాగ్స్ కూడా పవర్ఫుల్ గా ఉన్నాయి. సినిమాలో తప్పకుండా ప్రతి ఒక్క డైలాగ్ కూడా కంటెంట్ కు తగ్గట్టుగా ఉంటుంది అని అర్థం అవుతోంది. ఇక చివర్లో కూడా క్రిమినల్స్ ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదు అం8 ఒకవేళ ఆధారాలు లేకపోయినా కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని రవితేజ చెప్పిన డైలాగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.

చూస్తుంటే రవితేజ క్రాక్ తరహాలో మరొక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకునేలా ఉన్నాడు అనిపిస్తోంది. దర్శకుడు శరత్ ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ పాయింట్ ని కూడా చాలా హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. విలన్ పాత్రలు కూడా చాలా భయంకరంగా ఉంటాయట. రవితేజ ఇంతవరకు ఎప్పుడు చేయను ఒక స్టోరీ పాయింట్ ను ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట. ఇక గత ఏడాది సంక్రాంతికి క్రాక్ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఈ ఏడాది అదే తరహాలో ఖిలాడి సినిమాతో సక్సెస్ ను కంటిన్యూ చేయాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా నెగిటివ్ రిజల్ట్ ను అందుకుంది. దీంతో త్వరలో రాబోయే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X