‘అలా అవమానించారు... నాకు రావాల్సిన సినిమాలు ఆ హీరో చేతికి’

తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణించి నేమ్, ఫేమ్ పొందాలని ఎంతోమంది కలలు కంటూనే ఉన్నారు. అయితే కొందరు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటారు. కృషి, పట్టుదల, ప్రతిభ ఉంటే సామాన్యుడైనా.. అసాధారణ స్థాయికి చేరుకుంటారని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. హేమాహేమీలు ఉన్న టాలీవుడ్‌‌ను నాలుగు దశాబ్థాలుగా మకుటం లేని మహారాజుగా ఏలుతున్నారు చిరు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ కోవలకే వస్తారు మాస్ మహారాజా రవితేజ.

ఒకప్పుడు చిన్నా చితకా పాత్రలు పోషించిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా నిలిచారు. అయితే ఇదంతా రాత్రికి రాత్రి జరిగిపోలేదు.. దీని వెనుక ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఉన్నాయి. కొద్దినెలల క్రితం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే షోకు గెస్ట్‌గా వచ్చిన రవితేజ.. తన కెరీర్ గురించి వివరాలు పంచున్నారు.

Ravi Teja Recalls Early days Says Many Roles He Tried for Went to Srikanth in Unstoppable With NBK

రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడ, జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్‌లలో ఆయన బాల్యం గడిచింది. అమితాబ్ బచ్చన్, చిరంజీవిలను ఇష్టపడే రవితేజ.. వారి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కర్తవ్యం, అభిమన్యు, చైతన్య తదితర సినిమాలలో చిన్నా చితకా పాత్రలు పోషించారు. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రవితేజ.. తొలుత సింధూరం సినిమాలో ఒక హీరోగా నటించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, ఖడ్గం, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, నా ఆటోగ్రాఫ్, విక్రమార్కుడు, దుబాయ్ శీను, కిక్, బెంగాల్ టైగర్, రాజా ది గ్రేట్, కిర్రాక్ తదితర సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రవితేజ.

గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు రవితేజ.. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన భర్త మహాశయులకు విజ్ఞప్తితో హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం ఇరుముడి సినిమాలో నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా ఏదైనా సరే రవితేజ చేతిలో పడితే బొమ్మ బ్లాక్‌బస్టరే. రవితేజ సినిమా అంటే ఇంటిల్లిపాదికి వినోదం పక్కా అని ఆయన ముద్ర వేశారు.

ఇదిలాఉండగా.. కొద్దినెలల క్రితం ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్‌గా ప్రసారమైన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు గెస్ట్‌గా వచ్చారు రవితేజ. ఈ సందర్భంగా నీ కెరీర్ బిగినింగ్ డేస్‌లో చాలా ఆఫీసులు తిరిగి ఉంటావు, నో అని ఉంటారు, చేస్తావని లేదంటారు అని బాలయ్య ప్రశ్నించగా.. దీనికి రవితేజ సమాధానం ఇచ్చారు. ఫస్ట్ అంతా రిజెక్షనే. నేను, శ్రీకాంత్ ఒకే టైంలో వచ్చినవాళ్లం. నేను ట్రై చేసేవన్నీ శ్రీకాంత్‌కి వెళ్లిపోతుండేవి, నేను బాధపడే వాడిని కాదు, ఇబ్బంది పడేవాడిని కాదు. ఎందుకంటే బాగుంటాడు, బాగా చేస్తాడనే ఒక ఫీలింగ్ నాకు. కానీ అర్హత లేనివాళ్లకు వెళ్తే మాత్రం కొంచెం చిరాకుగా ఉండేది. అయినాసరే.. నువ్వు ఇక్కడేరా, నాది వేరు, నాలో నేనే, నాకు నేనే అనుకునేవాడిని అని రవితేజ ఎమోషనల్ అయ్యారు. దానికి బాలయ్య స్పందిస్తూ.. అందుకే రవితేజ గారంటే కొత్త స్టైల్, యూనిక్ స్టైల్ అని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ పాత వీడియో వైరల్ అవుతుండగా.. రవితేజ కష్టం, ప్రతిభను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X