Ravi Teja: మంచి మనసు చాటుకున్న రవితేజ.. దాని వల్ల నష్టపోయిన వాళ్ల కోసం గొప్ప పని
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచిన ఏకైక హీరో మాస్ మహారాజా రవితేజ. ఎన్నో ఏళ్ల పాటు కష్టనష్టాలను అనుభవించిన తర్వాత స్టార్‌గా మారిన అతడు.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. దీనికితోడు ఈ మధ్య వరుసగా 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య'తో భారీ హిట్‌లను అందుకుని.. ఇటీవలే 'రావణాసుర'తో రవితేజ వచ్చాడు. కానీ, ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దీంతో ఇప్పుడు అతడు ఓ గొప్ప పని చేశాడట. ఆ వివరాలను మీరే చూడండి!
రావణాసురుడిగా రవితేజ రాక: మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ తీసిన మూవీనే 'రావణాసుర'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ మంచి రోల్ చేశాడు.

అలాంటి టాక్.. కలెక్షన్లు ఇలా: మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ రూపొందించిన 'రావణాసుర' చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఆశించిన రీతిలో రెస్పాన్స్ దక్కలేదు. దీంతో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం కేవలం వారం రోజులకే చాలా చోట్ల రన్‌ను ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అన్ని కోట్ల నష్టాలతో డిజాస్టర్: క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'రావణాసుర' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 12 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రవితేజ నటించిన ఈ సినిమా రూ. 11 కోట్లు వరకూ నష్టాలను చవి చూసింది.
బయ్యర్లకు ఎక్కువ నష్టాలు: మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' సినిమాపై అంచనాలు ఏర్పడడంతో దీని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు దీనికి ఫ్యాన్సీ రేట్లకు అడిగారు. అయినప్పటికీ చాలా ఏరియాల్లో ఈ సినిమాను నిర్మాతలే స్వయంగా విడుదల చేశారు. అయితే, ఈ చిత్రం డిజాస్టర్ అవడంతో బయ్యర్లకు భారీ నష్టాలు ఎదురయ్యాయి.

గొప్ప పని చేసిన మాస్ హీరో: స్టార్ హీరో రవితేజ 'రావణాసుర' ఫలితంపై నిరాశగా ఉన్నాడు. అదే సమయంలో తమను నమ్మి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు నష్టపోవడాన్ని ఈ స్టార్ హీరో భరించలేకపోయాడని అంటున్నారు. దీంతో వాళ్లను ఆదుకునేందుకు నష్టపరిహారం చెల్లించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే కొందరు బయ్యర్లకు రవితేజ సెటిల్‌మెంట్ చేశాడని సమాచారం.


Click it and Unblock the Notifications











