క్రాక్ సినిమాకు రవితేజ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.. కానీ ఇప్పుడు అంతకుమించి!
మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా అనంతరం వరుస అపజయాలతో సతమతమవుతున్న ఈ హీరోకు క్రాక్ సినిమా ఒక్కసారిగా పవర్ఫుల్ బూస్ట్ ఇచ్చింది. ఇక సినిమా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. అయితే క్రాక్ సినిమా ద్వారా హిట్ అందుకోవడమే కాకుండా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఇటీవల పనైపోయింది అన్నవాళ్లే వెంటపడుతున్నట్లు తెలుస్తోంది.

డబ్బులు వెనక్కి వచ్చినట్లే..
మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద హిట్టు చూసి చాలా కాలమవుతోంది. ఇక క్రాక్ సినిమా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటి నుంచి కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద స్పీడ్ మరింత పెంచింది. ఏరియాల వారిగా కలెక్షన్స్ చాలా స్టాండేర్డ్ గా ఉన్నాయి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి దాదాపు డబ్బులు వెనక్కి వెచ్చినట్లేనని తెలుస్తోంది.

అందుకే రెమ్యునరేషన్ తగ్గించాల్సి వచ్చింది
అయితే క్రాక్ సినిమాకు రవితేజకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. మాస్ రాజా గత సినిమాలు టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ అలాగే డిస్కో రాజా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ఆ సినిమాల కారణంగా రవితేజ రెమ్యునరేషన్ కూడా తగ్గించాల్సి వచ్చింది.

ప్రాఫిట్ జోన్ లోకి..
ఇక బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ అనంతరం క్రాక్ సినిమాతో ఒక్కసారిగా మాస్ రాజా పంజా విసిరాడు. తన అసలైన పవర్ఫుల్ బాక్సాఫీస్ బలాన్ని చూపించాడు. కేవలం 50% సిట్టింగ్ కెపాసిటీతో థియేటర్స్ నడిచినప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు సమాచారం.

ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట..
మరోక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమాకు మాస్ రాజా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. గత సినిమాల ప్రభావం వలన నిర్మాతలు మాస్ రాజాతో చాలా వరకు సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదట. ఇక క్రాక్ కథ నచ్చడంతో మళ్ళీ హిట్ అందుకొని ఫామ్ లోకి రావాలని రెమ్యునరేషన్ తీసుకోలేదట. కానీ మరో విధంగా జేబులు నిండుతున్నట్లు తెలుస్తోంది.

కలెక్షన్స్ పెరిగేకొద్దీ.. లాభాలే..
ఈ రోజుల్లో హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం వంటి ఏరియాల రైట్స్ తీసుకుంటున్నారు. అంటే వచ్చిన లాభాలను జేబులో వేసుకోవడమే. సాధారణంగా రవితేజ రెమ్యునరేషన్ రూ.6కోట్ల వరకు రావాల్సిందట. కానీ అలా తీసుకోకుండా సినిమా విడుదల అనంతరం నైజాం, వైజాగ్ ఏరియాల షేర్స్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. దాదాపు రెండు ఏరియాల్లో రూ.9కోట్లకు పైగానే కెలెక్షన్స్ వచ్చాయి. ఇప్పట్లో సినిమా జోరు తగ్గేలా లేదు కాబట్టి నడిచే వరకు మాస్ రాజా ఆదాయం పెరిగుతూనే ఉంటుంది.


Click it and Unblock the Notifications











