For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి సినిమాలో రవితేజ రోల్ లీక్: ఊహించని పాత్రలో మాస్ హీరో.. ఆ ఎపిసోడ్‌‌కు పూనకాలు గ్యారెంటీ

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు భారీ స్థాయిలో వస్తున్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఇప్పటి హీరోలు ఇలాంటి వాటిలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. దీనికితోడు ఫిల్మ్ మేకర్లు కూడా మంచి కథలను రాస్తున్నారు. దీంతో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసే ప్రతి సినిమాలోనూ మరో హీరో భాగం అవుతున్నాడు.

  ఈ క్రమంలోనే కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం కూడా మల్టీస్టారర్‌గా రాబోతుంది. ఇందులో చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ నటించబోతున్నాడని తెలుస్తోంది. తాజాగా అతడి పాత్రకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసం!

  రామ్ చరణ్‌తో కలిసి ఆచార్యగా చిరు

  రామ్ చరణ్‌తో కలిసి ఆచార్యగా చిరు

  మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి 'ఆచార్య' అనే సినిమాను చేశారు. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించాడు. ఇది ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

  మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా

  మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా

  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌ను 'గాడ్ ఫాదర్' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. దీన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని 'భోళా శంకర్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లను ఇప్పటికే మొదలెట్టారాయన.

  బాబీతో మాస్ మూవీని ప్రకటించారు

  బాబీతో మాస్ మూవీని ప్రకటించారు

  వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్‌ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

  దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో

  చిరంజీవి సినిమాలో రవితేజ కూడా

  చిరంజీవి సినిమాలో రవితేజ కూడా

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా మల్టీస్టారర్ జోనర్‌లో తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు బాబీ గతంలోనే ప్రకటించాడు. దీంతో ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే హీరో ఎవరన్న దానిపై ఎన్నో రకాల చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆ పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అయింది.

  రవితేజ చేస్తోన్న పాత్ర వివరాలు లీక్

  రవితేజ చేస్తోన్న పాత్ర వివరాలు లీక్

  క్రేజీ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్‌గా రూపొందనున్న ఈ మూవీ ఓ స్టార్ హీరోకు, అభిమానికి మధ్య జరిగే కథతో రూపొందుతుందట. ఈ విషయాన్ని తాజాగా బాబీ కూడా రివీల్ చేసేశాడు. ఇక, ఇందులో హీరో పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడని అంటున్నారు. అలాగే, అతడిని ఆరాధించే అభిమానిగా మాస్ హీరో రవితేజ చేస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

  ఆ ఎపిసోడ్‌‌కు పూనకాలు గ్యారెంటీగా

  ఆ ఎపిసోడ్‌‌కు పూనకాలు గ్యారెంటీగా

  మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా కాంబినేషన్‌లో బాబీ తెరకెక్కించే ఈ సినిమా హీరో, అభిమాని మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా రూపొందనుంది. అప్పటి వరకూ ఆరాధించిన అభిమాని.. ఓ విషయంలో హీరోతో విభేదించడం.. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య పోరాటం జరగడం అనే కాన్సెప్టుతో ఈ మూవీ వస్తుందట. ఇందులో రవితేజ, చిరు ఎపిసోడ్ పూనకాలు తెప్పించేలా ఉంటుందట.

  రవితేజ పాత్ర ఎంతసేపు ఉంటుంది

  రవితేజ పాత్ర ఎంతసేపు ఉంటుంది

  ఇద్దరు స్టార్ హీరోల కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందట. అంతేకాదు, ఈ చిత్రం కోసం ఈ మాస్ హీరో 20 రోజులు డేట్స్ కేటాయించాడని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

  English summary
  Megastar Chiranjeevi Now Doing a Movie Under K. S. Ravindra Direction. Another Hero Ravi Teja Role Highlight in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion