పుకార్లకు ఫుల్‌స్టాప్... ఇక రవితేజ ‘డిస్కో’ ఆడించేస్తాడట!

Recommended Video

Disco Raja Not Shelved, Makers Clears The Air || Filmibeat Telugu

గత కొద్దికాలంగా తన ఖాతాలో సరైన హిట్ లేక సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ చేస్తున్న తాజా సినిమా 'డిస్కో రాజా'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సోషియా ఫాంట‌సీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని.. ఇక తదుపరి షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకోవడానికి చాలా సమయం పట్టవచ్చనే టాక్ వినిపించింది. ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు డిస్కోరాజా ఆగిపోవడం కారణంగా ఇతర దర్శకనిర్మాతలు రవితేజతో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారని గుసగుసలు వినిపించాయి. ఇవి గమనించిన డిస్కోరాజా యూనిట్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. వివరాల్లోకి వెళితే

 దర్శక, నిర్మాతల మధ్య అభిప్రాయ బేధాలు

దర్శక, నిర్మాతల మధ్య అభిప్రాయ బేధాలు

సోషియో ఫాంటసీ కథాంశం కావడంతో ఈ సినిమా రూపొందించేందుకు భారీ బడ్జెట్ అవసరమైందట. అయితే తాము కేటాయించుకున్న బడ్జెట్‌కి మించి బడ్జెట్ కేటాయించలేమని నిర్మాతలు చేస్తులెత్తేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయని, అందుకే సినిమాను నిలిపివేశారని టాక్ బయటకు వచ్చింది.

 రవితేజ మార్కెట్ దృష్టిలో పెట్టుకొనే..

రవితేజ మార్కెట్ దృష్టిలో పెట్టుకొనే..

మాస్ మహారాజ్‌గా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ కొట్టేసినప్పటికీ రవితేజ కెరీర్‌లో వచ్చినవన్నీ చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలే. ఈ చిత్రాల్లో కొన్ని చిత్రాలు నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ డిస్కోరాజా విషయానికొస్తే.. ఇది విభిన్న కథాంశం కావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోతోందట. దీంతో రవితేజ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని, అనుకున్న దానికి మించిన బడ్జెట్ పెట్టడం మా వల్ల కాదని నిర్మాతలు చెప్పేయడంతో సినిమా ఆగిపోయిందని అన్నారు.

డిస్కోరాజా

డిస్కోరాజా

డిస్కోరాజా ఆగిపోయిందనే వార్తలు బాగా వైరల్ అవుతుండటం గమనించిన చిత్రయూనిట్ చివరకు స్పందించింది. డిస్కో రాజా సెకండ్ షెడ్యూల్ తేదీని ప్రకటిస్తూ షూటింగ్ జరగనుండటం పట్ల తమ సంతోషాన్ని వ్యక్త పర్చింది. మే 27 వ తేదీ నుంచి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది.

డిస్కో రాజా గురించి

డిస్కో రాజా గురించి

ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా' చిత్రం తెరకెక్కుతోంది. చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ హీరోగా నటిస్తుండగా పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ ఆయన సరసన ఆడిపాడుతున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X