శర్వానంద్ కోసం రవితేజ ఇంత త్యాగం చేశాడా? బయటికొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం 'రణరంగం'. 1980 - 90 దశకాలకు సంబంధించిన కథతో రూపొందిందీ సినిమా. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో శర్వానంద్ లుక్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, ట్రైలర్‌లో చెప్పిన డైలాగులకు కూడా మంచి స్పందన వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో 'రణరంగం' సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ravi teja sacrifice for sharwanand

'రణరంగం' కథ మొదట మాస్ మహారాజా రవితేజకు చెప్పాడట డైరెక్టర్ సుధీర్ వర్మ. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ప్రస్తుతం రవితేజ చేస్తున్న 'డిస్కోరాజా', అజయ్ భూపతి సినిమా తర్వాత దీన్ని పట్టాలెక్కిద్దాం అని సుధీర్‌కు హామీ ఇచ్చాడని సమాచారం. ఈ నేపథ్యంలో 'రణరంగం' కథ శర్వానంద్ దగ్గరకు రావడానికి వెనుక చాలా జరిగిందని ప్రచారం జరుగుతోంది.

దీని ప్రకారం.. రవితేజ ఒప్పుకున్న ప్రాజెక్టులు అయ్యే లోపు చాలా సమయం ఉండడంతో సుధీర్ వర్మ.. శర్వాతో సినిమా చేయాలని అనుకున్నాడట. ఇందులో భాగంగానే అతడికి ఓ కథను చెప్పాడని తెలిసింది. అది అంతగా నచ్చకపోవడంతో.. ఇంకేదైన కథ ఉంటే చెప్పమన్నాడట శర్వా. అప్పుడే సుధీర్ 'రణరంగం' కథను చెప్పాడట. అయితే, ఇది రవితేజ కోసం రాసుకున్నానని, ఆయన కూడా దీనికి ఓకే చెప్పేశాడని అన్నాడట.

ఆ తర్వాత శర్వానంద్.. నేరుగా రవితేజతో ఈ కథ తనకు ఇవ్వాలని కోరాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో అడిగిన వెంటనే రవితేజ త్యాగం చేశాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దీంతో మాస్ మహారాజపై శర్వానంద్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X