ఎట్టకేలకు ప్రారంభం కాబోతున్న తేరి రీమేక్.. రవితేజకు హీరోయిన్ ఎవరంటే!

మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలతో జోరు పెంచాడు. ప్రస్తుతం రవితేజ విఐ ఆనంద్ దర్శత్వంలో డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అమర్ అక్బర్ ఆంటోని తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రం ఇదే. ఇదిలా ఉండగా రవితేజ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడు. రవితేజ చాలా కాలం క్రితమే తేరి చిత్ర రీమేక్‌లో నటించాల్సింది. కానీ అనుకోని కారణాల వలన ఆ చిత్రం ఆలస్యం అవుతూనే వస్తోంది.

అట్లీ, స్టార్ హీరో విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తేరి చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు రవితేజ, సంతోష్ శ్రీనివాస్ సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన నటించే హీరోయిన్ ని కూడా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Ravi Teja and Santhosh Srinivas to start Theri remake shooting soon

రవితేజకు హీరోయిన్‌గా కేథరిన్ నటించబోతోందట. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కి కూడా ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో రవితేజ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ గత చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీనితో ఓ భారీ హిట్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు. డిస్కోరాజా, తేరి రీమేక్ చిత్రాలు రవితేజకు విజయాన్ని అందిస్తాయోమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X