twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్.. మాస్ మహారాజా జోరు ఓ రేంజ్‌లో!

    |

    కొంతమంది సీనియర్ హీరోలు కూడా సినిమాలు ప్లాప్ అయితే రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి వస్తోంది. అయితే తక్కువ పేమెంట్ తీసుకున్న సినిమాలు కొన్నిసార్లు హిట్టవుతుండడంతో ఆ తరువాత మళ్ళీ ఎక్కువగా అడగలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. ఇక క్రాక్ సినిమాతో అలా కాకుండా ఒక ఏరియా హక్కుల రూపంలో తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాకి టెన్షన్ లేకుండా సాలీడ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

    వరుసగా నాలుగు డిజాస్టర్లు

    వరుసగా నాలుగు డిజాస్టర్లు

    మాస్ మహారాజా రవితేజ మొత్తానికి క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. రాజా ది గ్రేట్ అనంతరం ఎప్పటిలానే వరుస డిజాస్టర్స్ చూసిన విషయం తెలిసిందే. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ అంథోని, డిస్కో రాజా సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో రవితేజ తన మార్కెట్ ను కోల్పోవాల్సి వచ్చింది.

    సాలీడ్ కలెక్షన్స్

    సాలీడ్ కలెక్షన్స్

    ఇక ఫైనల్ గా మళ్ళీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూడవ సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఇదివరకే వీరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. క్రాక్ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకొని బెస్ట్ కాంబినేషన్ అనిపించుకున్నారు. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద 60కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

    మొదలైనప్పటి నుంచి అన్ని ఇబ్బందులే

    మొదలైనప్పటి నుంచి అన్ని ఇబ్బందులే

    క్రాక్ సినిమా రవితేజ కెరీర్ లోనే అత్యదిక వసూళ్లను అందుకున్న సినిమాగా నిలిచింది. నిజానికి ఆ సినిమా మొదలైనప్పటి నుంచి అన్ని ఇబ్బందులే వచ్చాయి. మొదట బడ్జెట్ లోపం వల్ల షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇక అసలే 50% ఆక్యుపెన్సీతో విడుదలవుతున్న సందర్భంలో ఆలస్యంగా థియేటర్స్ లోకి రావడం వలన సినిమా ఆడడం కష్టమని అనుకున్నారు.

    ఏరియా హక్కులు తీసుకోవడం వలన

    ఏరియా హక్కులు తీసుకోవడం వలన

    క్రాక్.. మాస్ కమర్షియల్ సినిమా కావడంతో సంక్రాంతి సీజన్ లో మొత్తానికి హిట్ టాక్ ను సొంతం చేసుకొని రవితేజకు 16కోట్ల షేర్ దక్కింది. రెమ్యునరేషన్ తీసుకోకుండా రవితేజ నైజాం ఏరియా హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ఖిలాడి సినిమాకు కూడా అదే రూల్ ఫాలో అవుతున్నాడు.

    Recommended Video

    YVS Chowdary పట్టు వదలని విక్రమార్కుడు.. మళ్ళీ Love Story తో..!! || Filmibeat Telugu
    అత్యదిక రెమ్యునరేషన్

    అత్యదిక రెమ్యునరేషన్

    ఇక రాబోయే కొత్త సినిమాకు మాత్రం నిర్మాతలు రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట. కొత్త దర్శకుడు శరత్ మండా తెరకెక్కించబోయే సినిమాలో రవితేజ ఒక ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం మాస్ రాజా తన కెరీర్ లోనే అత్యధికంగా 15కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. మరి వాటికి ఎలా తీసుకుంటాడో చూడాలి.

    English summary
    Similar situations have arisen many times in Ravi Teja's career. The longer Crack took on the form of an area rights rather than with the film. And now it seems that another film has taken solid remuneration without tension.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X