12 ఏళ్ల తరువాత మళ్ళీ ఆ బ్యూటీతో రవితేజ రొమాన్స్!
టాలీవుడ్ మాస్ మహారాజా హిట్టు చూసి చాలా కాలమవుతోంది. ఒకప్పుడు మినిమామ్ గ్యారెంటీ హిట్స్ అందుకునే రవితేజ ఇప్పుడు మాత్రం ఊహించని డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాతో మాస్ రాజా బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనుకుంటున్న తరుణంలో మళ్ళీ డీలా పడ్డాడు. ఇక ఎలాగైనా తన నెక్స్ట్ సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
ఇకపోతే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం రవితేజతో ఒక సీనియర్ హీరోయిన్ మళ్ళీ రొమాన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 12 ఏళ్ళ క్రితం వచ్చిన కృష్ణ సినిమాలో త్రిష రవితేజతో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత వీరిద్దరు మరో సినిమా చేయలేదు. వివి.వినాయక్ దర్శకత్వంలో 2008లో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది.

అప్పట్లో మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వచ్చింది గాని ఎందుకో సెట్టవ్వలేదు. ఇక ఇన్నాళ్లకు త్రిష,రవితేజ కాంబినేషన్ లో మరొక సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్న రవితేజ నెక్స్ట్ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో కథానాయికగా దర్శకుడు త్రిషను లైన్ లో పేట్టినట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం ఈ ప్రాజెక్టు పనులను కూడా స్టార్ట్ చేయాలని మాస్ రాజా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











