కాళేశ్వరం ప్రాజెక్టు క్రెడిట్ వారిదే అంటున్న రవితేజ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ శుక్రవారం(జూన్ 21) ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ మహాద్భుతమైన ప్రాజెక్టుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
టాలీవుడ్ హీరో రవితేజ స్పందిస్తూ దీనిపై ట్వీట్ చేస్తూ...'కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేటీఆర్, తెలంగాణ సీఎంకు కంగ్రాట్స్. ఈ క్రెడిట్ అంతా కూడా దీన్ని నిజం చేసిన, దీని రూపకల్పన వెనకే ఉన్న మేధావులదే' అని పేర్కొన్నారు.
అక్కినేని నాగార్జున స్పందిస్తూ... ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా వ్యాఖ్యానించారు. ఇది మానవ ఇంజనీరింగ్ అద్భుతం అంటూ ప్రశంసలు గుప్పించారు. కేటీఆర్, తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు.

అక్కినేని నాగార్జున స్పందిస్తూ... ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా వ్యాఖ్యానించారు. ఇది మానవ ఇంజనీరింగ్ అద్భుతం అంటూ ప్రశంసలు గుప్పించారు. కేటీఆర్, తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు.
దాదాపు 80 వేల కోట్ల పైచిలుకు ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. దీని కింద 45,000 ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదే.
రవితేజ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం రవితేజ 'డిస్కో రాజా' అనే చిత్రం చేస్తున్నారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవితేజతో 'నేల టిక్కెట్' మూవీ చేసిన రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











