మాస్ మహారాజ్ సిక్స్ ప్యాక్ లుక్.. వైరల్ అవుతున్న డిస్కోరాజా
వరుస పరాజయాలతో డౌన్ ట్రెండ్‌లో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ తన కొత్త సినిమా కోసం వీరోచితంగా కష్టపడుతున్నాడు. జిమ్ములో వర్కవుట్స్ చేస్తూ బాగా శ్రమిస్తున్నాడు. రవితేజ పాట్లు చూస్తుంటే ఆయన నెక్స్ట్ మూవీ డిస్కో రాజా బాక్స్‌ఆఫీస్ దుమ్ము దులపడం ఖాయంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ దర్శనమీయనున్నాడట.
ఈ మేరకు యువకుడి పాత్ర కోసమై జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నాడు రవితేజ. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మాస్ మహారాజ్ డంబెల్ ఎత్తుతూ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తున్నాడు. రవితేజ కష్టం చూస్తుంటే మరికొద్ది రోజుల్లో డిస్కోరాజా.. క్లాస్, మాస్ ఆడియన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనున్నాడని అర్థమవుతోంది.

ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో డిసాస్టర్ ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో వీఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిస్కోరాజా టైటిల్ కన్ఫర్మ్ చేశారు. చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











