‘ఖిలాడీ’ విషయంలో వెనక్కి తగ్గిన రవితేజ: మొత్తం మార్చేయాలని నిర్ణయం

మాస్ మహారాజా రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దీనికి కారణం ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన అతడి చిత్రం 'క్రాక్' సూపర్ డూపర్ హిట్ అవడమే. అంతేకాదు, ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. తద్వారా ఈ మాస్ హీరో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే అతడు వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే యాక్షన్ మూవీని మొదలు పెట్టాడు. అయితే, అనివార్య కారణాల వల్ల అది కాస్తా షూటింగ్‌ను పూర్తి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ లీకైంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఖిలాడీ' మూవీ షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయింది. దీనికి కారణం.. ఈ సినిమా షూట్ దుబాయ్‌లో జరగాల్సి ఉండడమే. అక్కడ చిత్రీకరణ జరపడానికి పర్మీషన్ ఇంకా రాలేదు. అందుకే దీన్ని ఆపేసి మరో సినిమాను రవితేజ పట్టాలెక్కించేశాడు. ఇక, ఇప్పటికీ ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీంతో ఈ సినిమాను హైదరాబాద్‌లోనే చిత్రీకరించాలని అనుకుంటున్నారట. దుబాయ్ మాదిరిగా సెట్స్‌ను నిర్మించి షూట్ పూర్తి చేయాలని యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ షూటింగ్‌ను ఆగస్టు మొదటి వారం నుంచి పున: ప్రారంభించబోతున్నారని తెలిసింది.

Ravi Tejas Khiladi Movie Shooting Shift to Hyderabad

ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X