అమర్ అక్బర్ ఆంటోని విడుదల వాయిదా!
మాస్ మహారాజ రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ చిత్రాన్ని శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ వేగంగా పూర్తవుతుండడంతో ముందుగా అనుకున్నా అక్టోబర్ లోనే చిత్రం విడుదల అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అమర్ అక్బర్ ఆంటోని చిత్రం వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
అక్టోబర్ 4 న రావాల్సిన చిత్ర ఏకంగా డిసెంబర్ 14 కు వాయిదా పడిందనే ప్రచారం జోరందుకుంది. వాయిదా వేయడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. రవితేజ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. చాలా కలం తరువాత ఇలియా ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో రాబోతున్న ఈ నాల్గవ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. అటు రవితేజకు, ఇటు శ్రీనువైట్లకు ఈ చిత్రం విజయం సాధించడం చాలా కీలకం.


Click it and Unblock the Notifications











