మాస్ రాజా అస్సలు తగ్గట్లేదుగా.. లైనప్ లో మరోక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా గ్యాప్ లేకుండా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక మీడియం రేంజ్ హీరోలు కూడా వారి కెరీర్ గ్రోత్ ను మరింత పెంచుకునే విధంగా గా ద్విభాషా చిత్రాలలో కూడా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రవితేజ లాంటి హీరోలు అయితే కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా కాస్త భిన్నంగా కొత్త తరహా కథను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. గత ఏడాది వరకు ఈ హీరోకి సరైన విజయాలు లేవు.
ఈ ఏడాది వచ్చిన క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఆ సినిమా కోవిడ్ ఫస్ట్ వేవ్ అనంతరం బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇక అదే ఊపులో ఎలాగైనా మరిన్ని విజయాలు అందుకోవాలని రవితేజ మంచి కథలను వింటున్నాడు. వీలైనంత వరకు కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా విభిన్నమైన బయోపిక్ కథలను కూడా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు మాత్రం ఒకే చెప్పకూడదు అని ఇప్పటికే రవితేజకు చాలా మంది సీనియర్ నటులు కూడా సలహాలు ఇచ్చారట. అయితే రవితేజ మాత్రం ఆ మధ్యలో కొన్ని చేసిన డిజాస్టర్ సినిమాలు ముందే కమిట్మెంట్ ఇవ్వడం వలన చేయక తప్పలేదట. మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి అని ముందే కమిట్మెంట్స్ ఇవ్వడం వంటి డీల్స్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఖిలాడి సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్న మాస్ రాజా ఆ సినిమాతో ఎలాగైనా క్రాక్ కంటే పెద్ద హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అలాగే వీలైనంత త్వరగా మరో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఖిలాడి సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక ఇటీవల రామారావు సినిమాను కూడా మొదలుపెట్టిన రవితేజ త్వరలోనే త్రినాథరావు నక్కిన సినిమాతో కూడా మరింత బిజీ కానున్నాడు. ఆ సినిమా ధమాకా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. సినిమా చూపిస్త మామ - నేను లోకల్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించిన త్రినాధ రావు మొదటిసారి రవితేజతో చేస్తున్నాడు కాబట్టి అంతకుమించి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు.
ఈ కథ విషయంలో దర్శకుడు గత ఏడాది నుంచి చర్చలు జరిపి రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో అనంతరం దిల్ రాజు బ్యానర్ లోనే మరొక త్రిల్లర్ సినిమాకు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వస్తోంది. కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోయే ఆ సినిమా కూడా త్వరలోనే మొదలు కానుంది. ఇక వచ్చే ఏడాది రవితేజ రామారావువు ధమాకా సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక క్రాక్ సినిమా హిట్ అయిన తర్వాత రవితేజ డైరెక్ట్ గా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. వీలైనంత వరకు ఏదో ఒక ఏరియా హక్కులను లాభాలుగా తీసుకునే విధంగా డీల్ సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











