తమిళ హీరోకు కరోనా పాజిటివ్.. రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన హీరో!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అయితే సినీ హీరోలు కూడా కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఒక తమిళ హీరో కరోనా బారిన పడటం సంచలనంగా మారింది. ఆయన కరోనా బారిన పడడంతో మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఆందోళనలో మునిగి పోయారు. అయితే ఎట్టకేలకు వారు ఆనందం వ్యక్తం చేశారు ఆ వివరాల్లోకి వెళితే..

కరోనా బారిన తమిళ హీరో

కరోనా బారిన తమిళ హీరో

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి టాలీవుడ్ సహా బాలీవుడ్ లో కూడా అనేక కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో మహేష్ బాబు, త్రిష, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, మంచు లక్ష్మి వంటి వారు కరోనా బారిన పడ్డారు. అయితే ఒక తమిళ హీరో కరోనా బారిన పడటం తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఆయన పడినట్లు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు మాస్ మహారాజా రవితేజతో కలిసి కనిపించడమే.

సోషల్ మీడియా వేదికగా

సోషల్ మీడియా వేదికగా

తమిళ హీరో విష్ణు విశాల్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనదంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరిగా ఆయన రాచ్చసన్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన గుత్తా జ్వాలను ప్రేమించి రెండో వివాహం చేసుకున్న విష్ణు విశాల్ ఈ మధ్యకాలంలో మాస్ మహారాజా రవితేజను కలిసినట్లుగా ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

 చాలా ఆసక్తిగా

చాలా ఆసక్తిగా

తాను కొద్ది రోజులలో ఒక అధికారిక ప్రకటన చేయబోతున్నానని ఆ ప్రకటన చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూన్నానని కూడా చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఆ విషయం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు కానీ అనుకోకుండా ఆయన ఇప్పుడు కరోనా బారిన పడడంతో, తాను బారిన పడినట్లుగా ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2022 పాజిటివ్ రిజల్ట్ తో మొదలైందని, తనకు కోవిడ్ వచ్చిందని చెప్పారు.

బయట పడతానని

బయట పడతానని

గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరినీ జాగ్రత్తగా ఉండమని ఆయన సూచించారు. విపరీతమైన ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు కూడా చెప్పారు. ఇక జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ తో పాటు జ్వరం కూడా వచ్చింది, త్వరలో దీని నుంచి బయట పడతానని అనుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పారు. విష్ణు విశాల్ ఈ విషయం చెప్పిన వెంటనే రవితేజ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

 సో రిలాక్స్

సో రిలాక్స్

ఎందుకంటే జనవరి 7న మాస్ మహారాజా రవితేజతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు విష్ణు విశాల్. రవితేజతో కలిసి సినిమా చేయబోతున్నట్లు కూడా హింట్ ఇచ్చారు. ఇక అదే టెన్షన్లో రవితేజ ఫ్యాన్స్ రెండు రోజుల క్రితమే విష్ణు విశాల్.. రవితేజని కలిశారా..? అంటూ విష్ణు విశాల్ ను ప్రశ్నించగా.. దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. అది పాత ఫొటో అని.. సో రిలాక్స్ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆ విషయంలో అయితే భయపడాల్సిన అవసరం లేదని తేలడంతో రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్ కాస్త తగ్గింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X