మరో కొత్త సినిమాను లాంచ్ చేసిన రవితేజ.. చాలా ఏళ్ళ తరువాత ఇలా..
2021 మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఏకైక హీరో మాస్ మహారాజా రవితేజ. క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా కరోనాకు భయపడి ఏ హీరో సినిమాను రిలీజ్ చేసే ధైర్యం చేయలేదు. కానీ కరోనా కష్టకాలంలో ధైర్యంగా క్రాక్ తో వచ్చి బాక్సాఫీస్ కు ఊపిరిపోసిన ఏకైక హీరోగా రవితేజ క్రేజ్ అందుకున్నాడు.
అలాగే క్రాక్ హిట్టుతో మాస్ రాజా వరుస అపజయాలకు కూడా బ్రేక్ పడింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ కొత్త సినిమాలకు ముహుర్తాలు ఫిక్స్ అవుతున్నాయి. ఖిలాడి సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న రవితేజ త్రినాథ రావ్ నక్కినతో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక కొత్త దర్శకుడు శరత్ మాండవతో కొత్త సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు.

ఆ సినిమాను పూజా కార్యక్రమాలతో నేడు స్టార్ట్ చేశారు. రవితేజ చాలా కాలం తరువాత కొత్త దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. రవితేజ ఈ సినిమా కోసం వర్కౌట్స్ కూడా చేస్తున్నట్లు టాక్ వస్తోంది. నెవర్ బిఫోర్ అనేలా సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. పూర్తిగా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా రెడీ చేసుకున్న ఆ కథ రవితేజకు చాలా బాగా కనెక్ట్ అయ్యిందట. ఈ దర్శకుడు ఇదివరకే తమిళ్ బిల్లా సినిమాతో పాటు తెలుగు బిల్లాకు కూడా మాటలు అందించాడు. విరాటపర్వం నిర్మాత సుధాకర్ ఈ కాంబినేషన్ ను నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











