మాస్ మహారాజా మరో బిగ్ బడ్జెట్ మూవీ.. డిఫరెంట్ టైటిల్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ అనుకోకుండా వస్తాయో ప్లాన్ చేసుకొని సెట్ చేస్తారో తెలియదు గాని టైటిల్స్ మాత్రం చాలా డిఫెరెంట్ గా ఉంటాయి. రవితేజ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని చాలా వరకు దర్శకులు టైటిల్ విషయంలో కాస్త గట్టిగానే ఆలోచిస్తారు. నెక్స్ట్ రవితేజ నుంచి క్రాక్ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా తరువాత మాస్ రాజా చేయవలసిన సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన వెంటనే దాదాపు మూడు సినిమాలను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక అందులో మెయిన్ గా వీర దర్శకుడు రమేష్ వర్మతో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ఫినిష్ అయినట్లు తెలుస్తోంది.

టైటిల్ విషయానికి వస్తే రవితేజ బాడీ లెంజ్వెజ్ కి తగ్గట్టుగా క్యారెక్టర్ ఉంటుందని ఖిలాడీ అనే టైటిల్ ని సెట్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కూడా ఇద్దరు ముద్దుగుమ్మలు నటించే అవకాశం ఉన్నట్లు టాక్. ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ అలాగే బబ్లీ గర్ల్ రాశి ఖన్నా హీరోయిన్స్ గా రవితేజతో రొమాన్స్ చేయనున్నారట. రవితేజ ఖిలాడి సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాని సీనియర్ నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











