రాంచరణ్ దేశభక్తి.. సినిమా సెట్‌లో!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. రంగస్థలం చిత్రం తరువాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇదిలా ఉండగా నేడు హైదరాబాద్ లో చరణ్ బోయపాటి చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు షెడ్యూల్ ప్రారంభం కానుండడంతో రాంచరణ్ ఆగష్టు 15 వేడుకల్ని సెట్ లోని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలోనే జండా వందన కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ చేప్పట్టబోతోంది.

ఈ చిత్రంలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సీనియర్ స్నేహ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదుల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











