Don't Miss!
- News
వైయస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం - ఒక్క సారిగా..!!
- Sports
BCCI అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా.. ఫేక్ న్యూస్‌తో ఫ్యాన్స్ అయోమయం!
- Finance
SBI ATM rules: మారిన SBI ఏటీఎం విత్‌డ్రా రూల్స్.. ఆ మోసాలను తగ్గించేందుకే.. తప్పక తెలుసుకోండి..
- Technology
Samsung Galaxy Z Fold 4 V/S Galaxy Z Fold 3 ఫోన్ల మధ్య తేడాలు? కొత్త ఫీచర్లు ఏంటో చూడండి.
- Automobiles
భారత్‌లో హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ Harley Davidson Nightster మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు
- Lifestyle
దశ మూలాలు కలిగిన ఈ ఆయుర్వేద ఔషధం మీ శరీరానికి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
RC 15: ఎగబడిన ఫ్యాన్స్.. అయినా వెనక్కి తగ్గని రామ్ చరణ్.. ఫొటో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శంకర్ దర్శకత్వంలో తన 15 సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసింది. RRR సినిమాతో ఎన్టీఆర్ తో కలిసి మొదటి ఫ్యాన్ ఇండియా విజయాన్ని షేర్ చేసుకున్న మెగా పవర్ స్టార్ RC15 సినిమాతో మాత్రం సోలోగా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద తనకంటూ ఒక మార్కెట్ను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు.
తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని దిల్ రాజు కూడా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్లో ఉండడంతో అప్పటివరకు విడుదల చేయడం కష్టమని దర్శకుడు శంకర్ సమ్మర్లో విడుదల చేద్దామని మరొక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో నిర్మాత దిల్ రాజు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక రీసెంట్ గా అమృత్సర్ లో ప్రత్యేకంగా మరొక షెడ్యూల్ను మొదలుపెట్టగా అక్కడికి రాంచరణ్ తో పాటు మరి కొంతమంది నటులు కూడా వచ్చారు. అయితే ఈ తరుణంలో రామ్ చరణ్ ను ప్రత్యేకంగా కలుసుకునేందుకు మెగా అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు.
మొదట సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నప్పటికీ ఆ తర్వాత రామ్ చరణ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మళ్ళీ వారి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఫోటోకు స్టిల్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. ఫ్యాన్స్ అందరు కూడా రామ్ చరణ్ తో ఫోటో దిగడం చాలా హ్యాపీగా ఉంది అని సోషల్ మీడియాలో కూడా ఫొటోను షేర్ చేసుకున్నారు. ఇక శంకర్ సినిమా అనంతరం రామ్ చరణ్ గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో మరొక కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేయడం చేయనున్న విషయం తెలిసిందే. అలాగే మరికొంతమంది అగ్ర దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.