RC16 : ఇండియన్ హెర్క్యులస్‌ బయోపిక్‌లో రామ్ చరణ్... ఇంతకీ ఆయనెవరు? కథేంటో తెలుసా?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉంది. మరోవైపు బుచ్చిబాబు సానాతో కూడా ఓ చిత్రం చేస్తున్నారు. అది రామ్ చరణ్ కెరియర్లో 16వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.

మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చి మగధీర సినిమాతో రికార్డులు కొల్లగొట్టాడు. ఇక రంగస్థలం సినిమాతో తనలోని నటుడని పరిచయం చేసిన రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబర్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 15వ సినిమాను లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

RC16 Movie Update: Ram Charan Acting in Indian Hercules Kodi Rammurthy Naidu Biopic Full Details Here

రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన తన 16వ సినిమాను బుచ్చిబాబు సానాతో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే తెలిపారు. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇండియన్ హెర్క్యులస్ బయెపిక్ గా తెరకెక్కుతుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇంతకీ ఆయన ఎవరు ఆయన కథేంటి అంటే... శ్రీకాకుళంకి చెందిన బాహుబల శాలి కోడి రామమూర్తిని ఇండియన్ హెర్క్యులస్ గా పిలుస్తారు.

ఆయన జీవిత చరిత్రపైనే ఈ చిత్రం ఉంటుందని.. అందులో రామ్ చరణ్ ఆయన పాత్రను పోషిస్తున్నరని ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన కోడి రామూర్తి నాయుడు క‌లియుగ భీముడిగా పేరు ఉంది. చిన్న‌వ‌య‌సులోనే మ‌ల్ల‌యుద్ధంలో ఆరితేరారు. 21 సంవత్సరాల వయసులోనే ఛాతిపై ఒక‌టిన్న‌ర ట‌న్నుల బండ‌రాయిని మోసి అబ్బుర పరిచారు. తర్వాత 3 టన్నుల భారాన్ని మోయ‌గ‌లిగే స్థాయికి చేరుకున్నారు.

RC16 Movie Update: Ram Charan Acting in Indian Hercules Kodi Rammurthy Naidu Biopic Full Details Here

అయితే ఆయన విన్యాసాలు తెలుగు ప్రజలనే కాదు.. ఇండియాను ఆకట్టుకున్నాయి. కోడి రామ్మూర్తి నాయుడు తెలుగు రాష్ట్రంలో ఎంతో మందికి వ్యాయామంతోపాటు బాడీ బిల్డింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు. మరి ఆయన బయెపిక్ లో రామ్ చరణ్ నటిస్తున్నారట. రామ్ చరణ్ కి ఉన్న గ్లోబల్ ఇమేజ్ లో ఈ సినిమానే చేస్తే.. ఈ స్టోరీ అందరికి తెలుస్తుందని దర్శకుడి ఆలోచన అని తెలుస్తోంది.

ఇక రామ్ముర్తికి ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదునే విదేశీయులు పెట్టారని నానుడి ఉంది. కానీ అలాంటి వ్యక్తికి ఇప్పుడు సరైన గుర్తింపు లేదని వారి ప్రస్తుత కుటుంబీకులు ఆవేదన పడుతుండగా.. చరణ్ ఇమేజ్ తో గ్లోబల్ ఆడియెన్స్ కు ఈ స్టోరీ చేరనుందని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X