14 కేజీల బరువు తగ్గిన జూ. ఎన్టీఆర్.. అనారోగ్యమా? అంటూ ఫ్యాన్స్‌లో కలవరం!

యంగ్ టైగర్ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన తారక్.. తన ఇమేజ్‌ను ప్యాన్ ఇండియాకు విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. దేవరతో నార్త్ ఆడియెన్స్‌ను మెప్పించిన ఎన్టీఆర్.. త్వరలోనే వార్ 2 సినిమాతో పూర్తిస్థాయి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎన్టీఆర్ పూర్తిగా సన్నగా మారిపోవడంతో ఫ్యాన్స్‌లో కలవరం మొదలైంది. అయితే తాను బాగా సన్నపడటానికి అసలు కారణం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

గతంలో రాఖీ సినిమా సమయంలో ఎన్టీఆర్ ఉబకాయంతో బాధపడేవారు. తన మిత్రులు, సన్నిహితుల హెచ్చరికలతో ఆయన పూర్తిగా తన ఆకారాన్ని మార్చుకొన్నారు. లైపోసెక్స్ సర్జరీ ద్వారా తన శరీర బరువును అదుపులోకి తెచ్చుకొన్నారు. అప్పటి నుంచి తన ఎత్తుకు తగిన బరువును మెయింటెన్ చేస్తున్నారు. యమదొంగ, కంత్రి సినిమాల్లో కుర్రాడిలా మారిపోయి ఆకట్టుకొన్నారు.

Reason Behind Jr NTR s 14 KGs Weight Loss

అయితే అప్పటి నుంచి ఎన్టీఆర్ తన వెయిట్, లుక్‌ను తన కంట్రోల్‌లోనే ఉంచుకొంటున్నారు. అయితే తాజాగా ఆయన తన సోదరుడు కల్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో గతంలో కంటే చాలా సన్నగా కొంత అసౌకర్యంగా ఉన్నట్టు కనిపించారు. దాంతో నందమూరి అభిమానుల్లో కంగారు మొదలైంది. తారక్ అనారోగ్యానికి గురయ్యాడా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

అయితే తారక్ బరువు తగ్గి సన్నగా మారడానికి అనారోగ్యం కాదు. ఆయన ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం వర్కువుట్, లుక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా కోసం బాడీ ఫిట్ చేస్తున్నాడు. చాలా కఠినమైన డైట్, వర్కువుట్స్ చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ సుమారుగా 14 కేజీల బరువు తగ్గారు. అంతకుమించి మరోటి లేదు. ఆయన ఆరోగ్యం గురించి చింత పడకూదు. కంగారు పడకూడదు అని ఇటీవల కల్యాణ్ రామ్ ఓ సందర్భంలో వెల్లడించారు.

Reason Behind Jr NTR s 14 KGs Weight Loss

అయితే గతంలో కూడా పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతకైనా తెగిస్తాడనే విషయం పలు సందర్భాల్లో స్పష్టమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా కోసం చూపిస్తున్న డెడికేషన్ చూసి.. సినీ వర్గాలే కంగుతింటున్నారు. సినిమా పట్ల ఆయన అంకిత భావానికి సెల్యూట్ కొట్టాల్సిందే అని ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల దేవర సినిమా భారీ విజయాన్ని అందుకొన్నారు. ఆగస్టు 14వ తేదీన హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన వార్ 2 సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉంటుంది. ఆ తర్వాత దేవర 2, అనంతరం లోకేష్ కనకరాజ్‌తో సినిమా ఉండే అవకాశం ఉందని కల్యాణ్ రామ్ వెల్లడించారు.

More from Filmibeat

Read more about: jr ntr prashanth neel kalyan ram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X