విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' ఆలస్యం వెనుక అసలు కారణం!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ప్రస్తుతం నయా సంచనలం. అర్జున్ రెడ్డ్, గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ సెన్సేషన్ గా మారిపోయాడు. అతడి నటన, డైలాగ్ డెలివరీ యువతకు బాగా కనెక్ట్ అవుతోంది. ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోయేలా గీత గోవిందం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపిస్తోంది. ఇక విజయ్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే టాక్సీ వాలా చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది.
వాస్తవానికి టాక్సీ వాలా చిత్రం గీత గోవిందం కంటే ముందే విడుదల కావాలి. కానీ ఆలస్యం జరుగుతోంది. రాహుల్ ఈ చిత్రానికి దర్శకుడు. అర్జున్ రెడ్డి చిత్రం తరువాత మారిపోయిన విజయ్ ఇమేజ్ కు అనుగుణంగా దర్శకుడు కొన్ని సన్నివేశాలని రీ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ సరసన ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రీ షూట్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన తరువాతే టాక్సీ వాలా విడుదల విషయంలో క్లారిటీ వస్తుంది.


Click it and Unblock the Notifications











