జూ ఎన్టీఆర్‌ను టైగర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? తారక్‌కు ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా?
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిరుదు ఉంటుంది. ప్రభాస్ ను రెబల్ స్టార్, మహేష్ బాబును సూపర్ స్టార్, అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్, రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అని పిలుస్తారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను టాలీవుడ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటుంది. మరి ఇంతకీ ఆయన పేరు వెనక టైగర్ అని చేరడానికి కారణం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయంపై మనమూ ఓ లుక్కేద్దాం పదండి.
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా యంగ్ టైగర్ అని తప్పకుండా యాడ్ చేస్తూ ఉంటారు. పిలిచినా, రాసిన యంగ్ టైగర్ అనేది మాత్రం మిస్ కాదు. ఎందుకంటే... సాధారణంగా హీరోలలో ఉన్న యూనిక్ ట్యాలెంట్ ను బట్టి అలా ప్రత్యేకంగా ఏదో ఒక బిరుదుతో పిలుస్తారు.

ఇక తారక్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ కాదు పాన్ ఇండియా స్టార్ అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సిని ప్రియులకు అందరికీ తెలుసు. RRR సినిమా తర్వాత తారక్ లోని యాక్టింగ్ ట్యాలెంట్ ప్రపంచానికి బాగా తెలిసి వచ్చింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న నెక్స్ట్ సినిమాల గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే తారక్‌ను టైగర్ అని పిలవడం వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. యమ దొంగ నుంచి యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. రాజమౌళి ముద్దుగా యంగ్ టైగర్ అని పిలచుకొంటారు. కానీ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. కానీ RRR సినిమా ఇంటర్వెల్ ఫైట్ సీన్ సినిమాకే మెయిన్ హైలెట్ అని చూసిన వాళ్లందరికీ తెలుసు.
టైగర్ లాంటి జంతువులతోపాటు ఎన్టీఆర్ జంప్ చేసే సీన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సీన్లు గుర్తు చేస్తూ సెంథిల్ కుమార్ తారక్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఆ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నప్పుడు తారక్ వేగాన్ని అందుకోవడం తమకు చాలా కష్టమైందని ఆయన చెప్పుకోచ్చారు.

అయితే తర్వాత అంత ఫాస్ట్‌గా ఎలా పరిగెత్తారు అని తారక్‌ని అడిగితే ఆయన తను నేషనల్ లెవెల్ అథ్లెట్ అనే విషయాన్ని చెప్పారని సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. అందువల్లే తారక్ ను అందరూ టైగర్ అని పిలుచుకుంటారేమో అని అన్నారు ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్. అయితే నిజానికి చాలామంది తారక్ అభిమానులకు ఈ విషయం తెలియదనే చెప్పాలి.
ఇప్పటిదాకా ఎంతోమంది ఆయన యాక్టింగ్ స్కిల్స్, నందమూరి నట వారసుడు అన్న కారణంతోనే టైగర్ అని పిలుచుకుంటున్నారని అనుకున్నారు. కానీ నిజానికి ఎన్టీఆర్ అథ్లెట్ కావడం వల్లే ఆయనకు ఈ పేరు వచ్చింది అన్న విషయాన్ని తాజాగా సెంథిల్ కుమార్ బయట పెట్టారు.
కాగా ప్రస్తుతం తారక్ దేవర, వార్ 2 సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ తెరకెక్కుతుండగా, మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీతో డైరెక్ట్ గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు తారక్. ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఆ షెడ్యూల్ పూర్తవ్వగానే తారక్ తిరిగి దేవర సెట్లో కాలు పెట్టబోతున్నారు.


Click it and Unblock the Notifications











