Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ లవ్ ప్రపోజల్.. ఎంత మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఎలాంటి వార్త వచ్చినా ఇట్టే వైరల్ అవుతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన తన లవ్ గురించి మాట్లాడిన ఒక పాత వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో ప్రభాస్ అమ్మాయిలు తన లవ్ ను రిజెక్ట్ చేశారని చెప్పడం కనిపిస్తోంది. మరి ఈ పాన్ ఇండియా స్టార్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిన అమ్మాయిలు ఎంతమంది అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
ఫిల్మ్ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ప్రభాస్ అని ఎవరైనా సరే టక్కున చెప్తారు. దాదాపు 40 ఏళ్లు పూర్తయిన ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఒక ఇంటి వాడు అయ్యే క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

కానీ ఈ విషయాన్ని ప్రభాస్ దగ్గర ఎప్పుడు ప్రస్తావించినా ఆయన ఎస్కేప్ అవుతారే తప్ప సమాధానం చెప్పరు. ఇక ఈ స్టార్ హీరోకు వేలల్లో పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఆయన లవ్ ప్రపోజల్ ను అమ్మాయిలు రిజెక్ట్ చేశారన్న విషయం మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో ప్రభాస్ మీ లవ్ ప్రపోజల్ ను ఎవరైనా రిజెక్ట్ చేశారా? అనే ప్రశ్నకు అవును చాలామంది చేశారు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పడం కనిపిస్తోంది.

ఆ వీడియోను వైరల్ చేస్తున్న నెటిజన్లు ప్రభాస్ అన్ననే రిజెక్ట్ చేశారంటే మనమెంత లైట్ తీసుకోండి అంటూ అమ్మాయిలు రిజెక్ట్ చేసిన అబ్బాయిలకు సపోర్ట్ చేస్తూ, మీమ్స్ తో సందడి చేస్తున్నారు. అయితే ప్రభాస్ కొంతమంది రిజెక్ట్ చేశారు అన్న విషయాన్ని బయట పెట్టాడు గానీ, అసలు వాళ్లు ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఇప్పటి దాకా ఎక్కడ వెల్లడించలేదు.

కాగా ఇప్పటిదాకా ప్రభాస్ పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిస్తున్నట్టు పుకార్లు షికార్లు చేశాయి. డార్లింగ్ మూవీలో నటిస్తున్నప్పుడు కాజల్ తో ఆయన రిలేషన్షిప్ లో ఉన్నట్టు రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత అనుష్క శెట్టితో పెళ్లి, పిల్లలదాకా వెళ్ళాయి పుకార్లు. బాహుబలి మూవీని చూశాక వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఊహించేసుకున్నారు చాలామంది.
ఆ తర్వాత ఆది పురుష్ మూవీ చేస్తున్న సమయంలో ఆయన కృతి సనన్ తో డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. మరి ప్రభాస్ ను పెళ్లాడబోయే అదృష్టవంతురాలు ఎవరు అనే సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో అని ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కాగా ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఉన్న ప్రభాస్ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నారు. జూన్ 27న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











