Prabhas Stylish look: డార్లింగ్‌ను ఇలా చూసి ఎన్నాళ్ళయ్యిందో.. మాకు ఇలాంటి ప్రభాస్ కావాలి

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం పాన్ ఇండియా స్టార్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడాని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదట్లోనే తన లుక్కుతో అమ్మాయిల మనసు దోచుకున్న రెబల్ స్టార్ మెల్లగా అందరికి డార్లింగ్ అయిపోయాడు. బాహుబలి వరకు కూడా ప్రభాస్ లుక్కుపై ఏనాడు విమర్శలు రాలేదు. కానీ సాహో సమయంలో మాత్రం కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ కనిపించిన విధానం షాక్ కు గురి చేసింది. ఇక ప్రస్తుతం అభిమానులు ఒక ఫొటోను వైరల్ చేస్తూ ఇలాంటి ప్రభాస్ లుక్కు కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలు

వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలు

ఇండియాలో ఏ స్టార్ హీరోకు దక్కని అవకాశాలు ప్రభాస్ ను వరిస్తున్నాయి. కెరీర్ లో మొదటిసారి డార్లింగ్ వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఈ ఏడాది అనంతరం ఒకదాని తరువాత మరొకటి గ్యాప్ లేకుండా సినిమాలు రాబోతున్నాయి. డిఫరెంట్ లైనప్ సెట్ చేసుకోవడంతో అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి.

 బాహుబలి పెంచిన అంచనాల వలన

బాహుబలి పెంచిన అంచనాల వలన

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్లు కష్టపడిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత వెంటవెంటనే వేగంగా సినిమాలు చేయాలని అనుకున్నాడు. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కూడా చేయాలని అనుకున్నాడు. కానీ బాహుబలి పెంచిన అంచనాల వలన సాహో నుంచి మళ్ళీ అదే తరహాలో సినిమాలు చేయక తప్ప లేదు.

 సాహోలో దారుణమైన లుక్స్

సాహోలో దారుణమైన లుక్స్

అయితే సాహో సినిమా చాలా వరకు కొంతమంది అభిమానులను సైతం నిరాశపరిచింది. ముఖ్యంగా అందులో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ కనిపించిన విధానం షాక్ కు గురి చేసింది. దర్శకుడు సుజిత్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రభాస్ అలా కనిపించినట్లు అనేక రకాల ట్రోల్స్ కూడా వచ్చాయి.

 ప్రభాస్ పాత ఫొటో వైరల్

ప్రభాస్ పాత ఫొటో వైరల్

ఇక ప్రస్తుతం తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో ఎలా ఉంటాడో గాని ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఫేస్ క్లోజప్ లుక్స్ వదిలింది లేదు. అయితే అభిమానులు ఇప్పుడు డార్లింగ్ పాత ఫొటోను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. అందులో గాగుల్స్ పెట్టుకొని ఉన్న ప్రభాస్ హ్యాండ్సమ్ అనే పదానికి మరో అర్థం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
 అభిమానుల కోపం

అభిమానుల కోపం

ఇలాంటి ప్రభాస్ ను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నట్లు కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతోంది. ఇక రాధేశ్యామ్ దర్శకుడిపై అలాగే యూవీ నిర్మాతలపై కూడా ఫ్యాన్స్ చాలా కోపంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. గతంలో వదిలిన పోస్టర్స్ అంతగా ఎవరికి నచ్చలేదు. ఇప్పుడైనా పోస్టర్స్ సాంగ్స్ ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X