మాట తప్పని మడమ తిప్పని ప్రభాస్.. ఫ్యాన్స్ కోసం ప్లానింగ్ మామూలుగా లేదుగా!
Prabhas:బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ జోరుమీదున్నారు పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. 'సాలర్' సినిమాతో భారీ వసూళ్లు చేసి.. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన డార్లింగ్.. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఫ్యాన్ ఇండియా మూవీ'కల్కి 2898 ఏడీ' కూడా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే రూ. 1200 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. టాలివుడ్ లో కలెక్షన్ల సునామీని స్రుష్టించింది. మొత్తానకి ఈ బ్లాక్ బాస్టర్ తో రెబల్ సార్ట్ మరో మెట్టు పైకి ఎక్కారు.
ఇలా వరుస హిట్లతో పుల్ జోష్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ పై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ తరుణంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సక్సెస్ పుల్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ 'రాజా సాబ్'. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్లలు నిర్మిస్తున్నారు. అయితే గతంలో డార్లింగ్ చేయని రొమాంటిక్ హారర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తియినట్లు సమాచారం.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను చూస్తూంటే.. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ పై చూపించడానికి డైరెక్టర్ మారుతి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా అందరినీ థ్రిల్ చేస్తున్నాయి. ప్రభాస్ వింటేజ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఈ సినిమా తరువాత సలార్-2, కల్కి-2 ల షెడ్యూల్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కల్కి-2 ను త్వరలో ప్రారంభిస్తామని ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రకటించారు. అలాగే.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీర్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్న విషయం తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ పవర్ పుల్ పోలీస్ అధికారిగా ప్రభాస్ నటిస్తారంట.



Click it and Unblock the Notifications











