For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: 'రెచ్చిపోదాం బ్రదర్' అంటూ రచ్చ చేస్తున్న వెంకీ, వరుణ్!

    |

    విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని దర్శకుడు. వినోదాత్మక చిత్రాలని తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలని పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ సారి అనిల్ రావిపూడి కంప్లీట్ గా గురి మొత్తం కామెడీ పైనే పెట్టినట్లు తెలుస్తోంది.

    Rechhipodham Brother Video Song released from F2

    ఇప్పటికే విడుదలైన ఎఫ్2 టీజర్ చూస్తుంటే ఈ సంక్రాంతికి తోడల్లుళ్లుగా వస్తున్న వెంకీ, వరుణ్ తేజ్ రచ్చ ఏవిధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. కడుపుప్పా నవ్వించే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు దేవిశ్రీ ప్రసాద్ తన సాంగ్స్ తో ఆడియన్స్ ని మరింతగా ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని రెచ్చిపోదాం బ్రదర్ అంటూ సాగే వీడియో సాంగ్ ట్రైలర్ ని విడుదల చేశారు.

    ఈ పాట మంచి ఉషారెత్తించేలా ఉండబోతోంది. భార్యలనుంచి తప్పించుకున్న భర్తలు ఎలా ఎంజాయ్ చేస్తారో అనే అంశంతో ఈ పాటని చిత్రీకరించారు. వెంకీ, వరుణ్ తేజ్ దుమ్ము దుమారం చేస్తుండగా వీరికి రాజేంద్ర ప్రసాద్ కూడా జత కలిశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Rechhipodham Brother Video Song released from F2. Anil ravipudi directing this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X