RED Trailer Release: హీరోయిన్‌పై చిలిపిగా పంచ్ విసిరిన హీరో రామ్.. ఏమన్నారో తెలుసా?

సెన్సేషన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బాక్సాఫీస్ వద్ద తన రేంజ్‌ను పెంచుకొన్నారు. ఇస్మార్ట్ విజయం తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం RED. ఈ చిత్రం 2020 ఎప్రిల్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది.

ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన 'కౌన్ హే అచ్చా‌... కౌన్ హే లుచ్చా' పాట సహా అంతకుముందు విడుదలైన పాటలకు శ్రోతల నుండి అద్భుతమైన స్పందన లభించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకం పై సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.

 RED Trailer Release: Ram Pothineni punch Malavika Sharma

ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో RED చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకు ల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను గురువారం ఏఎంబీ మాల్‌లో ఆవిష్కరింంచారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, దామోదర ప్రసాద్, స్రవంతి రవికిషోర్, సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, దర్శకుడు కిషోర్ తిరుమల, హీరోయిన్లు నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ పాల్గొన్నారు.

RED ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో రామ్ ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా కనిపించారు. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ల గురించి మాట్లాడారు. ఈ సినిమాలోని వారి పాత్రలు, ప్రతిభ గురించి వివరంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాళవిక శర్మ గురించి మాట్లాడుతూ రామ్ చిలిపిగా తనదైన శైలిలో పంచ్ వేశారు. RED సినిమా అనగానే సిన్సియర్‌గా రెడ్ డ్రస్‌ వేసుకొని వచ్చారు అంటూ నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత తన స్పీచ్‌ను కొనసాగిస్తూ మాళవిక అద్భుతంగా నటించింది అంటూ కితాబు ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X