టెంపర్ రీమేక్ విడుదలకు కుదిరిన ముహూర్తం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీలో సింబా పేరుతో రీమేక్ అయింది. రణవీర్ సింగ్ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో ఈ చిత్రాన్ని అయోగ్య పేరుతో తెరకెక్కిస్తున్నారు. విశాల్ హీరోగా నటిస్తున్నాడు. క్రేజీ బ్యూటీ రాశి ఖన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్ర చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయోగ్య చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించింది. ఏప్రిల్ 19న అయోగ్యని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో విశాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వెంకట్ మోహన్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రద్దా దాస్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది.

Release date locked for Vishals Ayogya movie

అవినీతిపరుడిగా ఉన్న పోలీస్ అధికారి మంచిగా ఎలా మారాడు అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయోగ్య చిత్రం ఆ స్థాయిలో మెప్పిస్తుందో లేదో చూడాలి. ఠాగూర్ మధు ఈ చిత్రానికి నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X