పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్న సుప్రీమ్ హీరో: రాజకీయాలను టచ్ చేస్తూ అలా!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి తెరకెక్కించి 'రేయ్' సినిమాతో పరిచయం అవ్వాల్సి ఉన్నా.. అది అనివార్య కారణాలతో వాయిదా పడడంతో 'పిల్లా నువ్వు లేని జీవితం' ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలోనే మంచి సినిమాలు తీసిన అతడు.. ఆ తర్వాత వరుసగా పరాజయాలను మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 'చిత్రలహరి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత ఇటీవల మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్‌గా చేస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా 'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న దీన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

Republic Title Fix for Sai Dharam Tej Deva Katta Movie

దీని తర్వాత సాయి ధరమ్ తేజ్.. ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభం అయింది. భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవ కట్టా సినిమాలు అంటేనే భిన్నమైన కథాంశంతో సాగుతాయి. ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌తో చేసే సినిమా కూడా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ సినిమాకు 'రిపబ్లిక్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X