Allu Arjun కోసం అపురూపమైన బహుమతి.. మల్టీమిలియనీర్ ఏమిచ్చారో తెలుసా?
స్టైలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఒక పక్క తెలుగు మార్కెట్ తో పాటు మలయాళం మార్కెట్ కూడా భారీగా పెంచుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉందో మలయాళంలో కూడా అంతే క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలు ఎక్కువగా మలయాళం లో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అయితే కేరళ మూలాలు ఉన్న ఒక దుబాయ్ బిజినెస్మెన్ అల్లు అర్జున్ కి అరుదైన గిఫ్ట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

దుబాయ్ ట్రిప్
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ వచ్చిన ఫ్యామిలీతో గడిపే అల్లు అర్జున్ ఈ రోజు తన భార్య పుట్టినరోజు కావడంతో కొద్ది రోజుల క్రితం దుబాయ్ వెళ్ళారు.. అక్కడ తన భార్య, కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అర్జున్ ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.

స్పెషల్ గిఫ్ట్
అయితే దుబాయ్ లో సెటిల్ అయిన కేరళ మూలాలు ఉన్న ఒక మల్టీ మిలియనీర్ అల్లు అర్జున్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక పిస్టల్ ని అల్లు అర్జున్ కి గిఫ్ట్ ఇచ్చారు. దుబాయ్‌కు చెందిన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ ఈ బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మలయాళ దర్శకుడు ఒమర్ లులు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.. ఈ దర్శకుడు మరెవరో కాదు ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటి ఫేమస్ అయిన ఒరు ఆదార్ లవ్ సినిమా దర్శకుడు.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలను పంచుకుంటూ ఉండే ఉమర్ తన స్నేహితుడు రియాజ్ కిల్టన్ అల్లు అర్జున్ కి గిఫ్ట్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాను చేస్తున్నాడు.

రెండు భాగాలుగా
ఈ పుష్ప సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాలో ఆమె శ్రీవల్లి అనే పాత్రలో నటిస్తోంది అనే విషయాన్ని ఇవాళే రివీల్ చేశారు. ఇక ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించారు.
Recommended Video

ముందే పుష్ప
డేట్ ఇంకా ప్రకటించక పోవడంతో ఈ పుష్ప ది రైజ్ చిత్రాన్ని ముందే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది . ఇక శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ముత్తం శెట్టి మీడియా సంస్థతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











