79 ఏళ్ల వయసులో 7 బిడ్డకు జన్మనిచ్చిన లెజెండరీ హీరో.. సినిమా ప్రమోషన్‌లో సంచలన ప్రకటన

ప్రపంచ సినీ దిగ్గజం రాబర్ట్ డి నీరో సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఓ రికార్డును సొంతం చేసుకొన్నారు. తన జీవితంలో 80వ బర్త్ డేను జరుపుకోబోతున్న ఆయన ఏడో బిడ్డకు జన్మనిచ్చారు. వృద్దాప్యంలో ఏడో సంతానాన్ని పొందిన ఆయనకు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలుపుతున్నారు. రాబర్ట్ డీ నిరో వెల్లడించిన విషయం ప్రపంచ మీడియాలో వైరల్ అయింది. పలు మీడియాల్లో పతాక శీర్షికల్లో ఈ వార్తను ప్రచురించడం విశేషంగా మారింది. రాబర్ట్ డి నిరో వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోకి వెళితే..

80 ఏళ్ల వయసులో :హాలీవుడ్‌లో రాబర్ట్ డి నిరో పేరు చెబితే.. గాడ్ ఫాదర్, రేజింగ్ బుల్ సినిమాలు గుర్తుకు వస్తాయి. రెండు సార్లు ఆస్కార్ అవార్డు పొందిన ఆయన ఘనత కళ్ల ముందు ఉంటుంది. 80 ఏళ్ల వయసులో కూడా రాబర్ట్ డి నిరో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఎబౌట్ మై ఫాదర్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని లారా టెర్రసో దర్శకత్వం వహించారు. లెస్లీ బిబ్, అంర్స్ హోల్మ్, డేవిడ్ రాస్చే, కిమ్ కట్ట్రాల్ తదితరులు నటించారు.

Robert De Niro blessed with Seventh Baby at Age of 79 years

ఏడో బిడ్డకు జన్మనిచ్చాం అంటూ :ఎబౌట్ మై ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ డి నిరోను మీ ఆరుగురు పిల్లల గురించి చెప్పమని అడిగితే.. ఆరుగురు కాదు.. ఏడుగురు. ఇటీవలే నాకు ఓ బిడ్డ పుట్టాడు అంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ఏడో బిడ్డకు జన్మనిచ్చామని సంచలన విషయాన్ని బయటపెట్టారు.

Robert De Niro blessed with Seventh Baby at Age of 79 years

చట్టాలను పెద్దగా పట్టించుకోను :తనకు పిల్లలంటే ఎనలేని ప్రేమ. ఆ కారణంగానే నేను ఈ వయసులో కూడా పిల్లలు కావాలని కోరుకొన్నాను. చట్టాలను పెద్దగా పట్టించుకోను అని ఓ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. అయితే నా పిల్లలు యాక్టర్లు కావాలనుకొంటే.. నన్ను స్పూర్తిగా తీసుకోవాలని చెబుతాను. అందుకు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రతిభతోనే రాణించాలని చెబుతాను అని రాబర్ట్ డీ నీరో చెప్పారు.

Robert De Niro blessed with Seventh Baby at Age of 79 years

నాకు పంచప్రాణాలు అంటూ :రాబర్ట్ డి నిరో మీడియాతో మాట్లాడుతూ.. నేను అంతగా కూల్ డాడీని కాదు. పిల్లలంటే ప్రేమ మాత్రమే. నా పిల్లలు నాపై అసంతృప్తితో, నా అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు. కానీ నేనంటే వారికి అమితమైన గౌరవం. నాకు 11 ఏళ్ల కూతురు ఉంది. చాలాసార్లు ఆమెతో పోట్లాడుతాను. నా కూతురంటే నాకు పంచప్రాణాలు. సమయం చిక్కితే పిల్లలతో సరదాగా ఉంటాను అని రాబర్ట్ డి నిరో తెలిపారు.

Robert De Niro blessed with Seventh Baby at Age of 79 years

రాబర్ట్ డి నిరో సంతానం వివరాల్లోకి..:రాబర్ట్ డి నిరో పిల్లలు, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయను రెండుసార్లు వివాహం చేసుకొన్నారు. ఆయన మొదటి భార్య డిన్నే అబాట్‌కు పుట్టిన పిల్లలు ఇద్దరు. డ్రేనా 51 సంవత్సరాలు, రాఫెల్ 46 సంవత్సరాలు. మాజీ భార్య గ్రేస్ హైటవర్‌తో ఇద్దరు పిల్లలను కన్నారు. ఇలియట్‌కు 25 సంవత్సరాలు, హెలెన్‌కు 11 సంవత్సరాలు. ఇక మాజీ ప్రియురాలు టౌకీ స్మిత్‌తో ఇద్దరు కవలలు ఆరోన్, జూలియన్ ఉన్నారు. రాబర్ట్ డి నిరోకు ఒక మనవరాలు, ముగ్గురు మనవళ్లు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X