‘రొమాంటిక్ క్రిమినల్స్’... బూతు సీన్లు చేయడంపై హీరో రియాక్షన్ ఇదీ!
ఈ మధ్య కాలంలో తెలుగులో బూతు కంటెంట్ ఉన్న సినిమాల సంఖ్య పెరిగిపోయింది. చిన్న సినిమాలన్నీ దాదాపు అశ్లీలమైన సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులతోనే ఉంటున్నాయనే విమర్శలు తరచూ వింటూనే ఉన్నాం. జీవిత లాంటి వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పోకడను తప్పుబడుతూ స్టేట్మెంట్స్ సైతం ఇచ్చిన సంగతి తెలిసిందే.
త్వరలో విడుదల కాబోతున్న 'రొమాంటిక్ క్రిమినల్స్' చిత్రం కూడా బూతు కేటగిరీకి చెందిన చిత్రమే అనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఈ చిత్రంలో హీరోగా నటించిన మనోజ్ నందం స్పందించారు.

సినిమా అనేది ఒక ఎంటర్టెన్మెంట్ మీడియం, ఇన్‌ఫ్లూయోన్సియల్ మీడియం. అలా అని నాలుగు పైట్లు, ఆరు పాటలతో డాన్సులు చేయడమే సినిమా కాదు. పక్క రాష్ట్రం వారు డిఫరెంట్ సినిమాలు చేస్తే బావుందని మెచ్చుకుంటారు, మన వాళ్లు ఇలాంటి సబ్జెక్టులు చేయరు అంటారు.... కానీ మన వద్ద ఏదైనా విభిన్నంగా ట్రై చేస్తే ఏదో ఒక వంక పెట్టి విమ్శలు చేస్తారు. అందుకే మేము ఈ విమర్శలను పట్టించుకోమని మనోజ్ నందం తెలిపారు.
'రొమాంటిక్ క్రిమినల్స్'లో బోల్డ్ సీన్లు ఉన్న మాట నిజమే. అయితే అవి కథలో భాగంగా ఉంటాయి. నేను సునీల్ కుమార్ రెడ్డిగారి సినిమా చేయడానికి కారణం ఆయన ఎంచుకునే సబ్జెక్టులు ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఆయన డబ్బుల కోసం సినిమా తీసే డైరెక్టర్ కాదు. మంచి కథ, మంచి డైరెక్టర్ కాబట్టే 'రొమాంటిక్స్ క్రిమినల్స్' చేయడానికి ఒప్పుకున్నట్లు మనోజ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











