ఎవడ్రా వీడు ఇంత డేంజరస్‌గా ఉన్నాడు.. పబ్లిక్‌లోనే రౌడీహీరోను పరుగెత్తించాడు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు. వేసే బట్టలు, తొడిగే చెప్పులు.. దగ్గర నుంచి.. రౌడి హీరోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకపోయినా... దేశవ్యాప్తంగా క్రేజ్ అయితే ఉంది. ఇక ఈ రౌడీ హీరోను ఓ అభిమాని భయపెట్టాడు. ఏకంగా పరిగెత్తించాడు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నువ్విలాతో పరిచయం: నువ్విలా సినిమాలో చిన్న రోల్ చేసి.. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రమణ్యం సినిమాల్లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో.. సూపర్ హిట్టును అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ కు మంచి ఆఫర్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా అర్జున్ రెడ్డి. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చింది. ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు.

ఖుషితో వస్తున్న విజయ్: అలా ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు విజయ్ వచ్చాయి. మంచి సూపర్ హిట్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరించాడు. గత ఏడాది వచ్చిన లైగర్ తో మాత్రం నిరాశ పరిచాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ విజయ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

తమ్ముడు కూడా సక్సెస్: ఇదిలా ఉంటే విజయ్ తమ్ముడు కూడా ఇప్పుడిప్పుడే లైన్ లోకి వస్తున్నాడు. బేబీ సినిమాతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఈ సినిమా అయితే రోజురోజుకు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది. ఆనంద్, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రాజేశ్ సాయి దర్శకత్వం వహించాడు. ఎస్కేఎస్ నిర్మాతగా వ్యవహారించాడు. ఇక ఇటీవల బేబీ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

పరిగెత్తించిన అభిమాని: ఈ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతుండగా.. ఓ అభిమాని స్టేజీ పైకి ఎక్కి అతడి పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏం ఉందంటే.. విజయ్ మాట్లాడుతుండగా ఓ అభిమాని సడన్ గా స్టేజీ పైకి దూసుకువస్తాడు. అది చూసిన విజయ్ దేవరకొండ అతడు తన పాదాలపై పడకుండా ఉండేందుకు వెంటనే పక్కకు పరుగెత్తాడు.

నెక్స్ట్ మూవీస్ ఇవే: ఇంతలో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని పట్టుకుని వెళ్లిపోతారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏకంగా లైగర్ హీరోనే భయపెట్టాడుగా వీడు మామూలు అభిమాని కాదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విజయ్ ప్రస్తుతం ఖుషి చిత్రం ప్రమోషన్స్ లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత విజయ్.. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 చిత్రంలోనూ అదే విధంగా పరశురాం దర్శకత్వంలో VD13 సినిమాలోనూ నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











