Vijay Devarakonda: ఆ ఇద్దరమ్మాయిలకు రౌడీ హీరో షాకింగ్ రిప్లై... అలా చేస్తే కలుస్తానంటూ!
రౌడీ విజయ్ దేవరకొండ ఈ పేరు పాన్ ఇండియా రేంజ్లో ఉన్న మూవీ లవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉంటున్న ఆయన త్వరలోనే ఈ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అయితే తాజాగా ఆయన ఇద్దరు లేడీ స్టూడెంట్స్‌కు ఊహించని విధంగా షాకింగ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. అందరూ దీని గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు. మరీ ఇంతకీ ఆయన ఏం రిప్లై ఇచ్చారు? అది ఎందుకంత చర్చనీయాంశమైంది? ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం....
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా చేసి ఓవర్ నైట్‌లో స్టార్ హీరో అయిపోయారు. ఆ తర్వాత గీతా గోవిందం చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా రేంజ్లో స్టార్ హీరోగా మారిపోయారు. అయితే ఆయనకు అంత క్రేజ్ ఉన్నప్పటికీ సరైన భారీ హిట్ ఇంత వరకు పడలేదు.

ఈ మధ్య ఖుషి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనించే సక్సెస్‌ను అందుకున్నారు విజయ్. అయితే అది ఆయన స్టార్ డమ్ రేంజ్ హిట్ కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ రౌడీ హీరో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే.
తన సినిమాల విశేషాలతో పాటు సమాజంలో జరిగే పలు విషయాలపైన కూడా స్పందిస్తుంటారు. సామాజిక సేవ కూడా చేస్తుంటారు. ఏదో ఒక విషయం ద్వారా ఎప్పుడూ ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటుంటారు. అయితే తాజాగా బెంగళురులో చదువుకుంటున్న ఓ లేడీ స్టూడెంట్ అభిమాని పోస్ట్ పెట్టగా దానికి విజయ్ ,స్వీట్ రిప్లై ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
రీసెంట్‌గా ఇద్దరు విద్యార్ధినులు విజయ్ కోసం పెట్టిన ఓ వీడియో పోస్ట్ నెట్టింట్లో ఎంతటి వైరల్‌గా మారిందో తెలిసిన విషయమే. విజయ్ కామెంట్ చేస్తేనే పరీక్షలు రాయడానికి సిద్ధమవుతాం అంటూ వారు క్యాప్షన్ రాసుకొచ్చారు. అది కాస్త నెట్టింట్లో బాగా ట్రోల్ అండ్ ట్రెండ్ అయింది. ఈ ఇద్దరు అమ్మాయిలకు విజయ్ రిప్లై ఇస్తారా?ఏంటి? అంటూ చాలా మంది ఫన్నీ ఫన్నీగా సెటైరికల్‌గా కామెంట్లు చేశారు. అయితే సడెన్‌గా దీనిపై ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.
90 మార్కులు తెచ్చుకుంటే తప్పకుండా కలుస్తా.. అంటూ ఆ విద్యార్ధినులకు స్వీట్ రిప్లై ఇచ్చారు విజయ్. దీంతో ప్రస్తుతం ఆయన పెట్టిన కామెంట్ మరింత వైరల్‌గా మారింది. తన అభిమానుల కోసం విజయ్ ఈ విధంగా స్పందించిన తీరుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











