Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విజయ్ దేవరకొండ న్యూ రికార్డ్.. పోటీలో అల్లు అర్జున్ ఉన్నా కూడా..
టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఒక సాదారణ సపోర్టింగ్ యాక్టర్ నుంచి హీరోగా ఎదిగిన విజయ్ మొదట్లో అవకాశాల కోసం చాలా కష్టలను ఎదుర్కొన్నాడు. ఎలా పడితే అలా సినిమాలు చేయకుండా డిఫరెంట్ కథలను ఎంచుకొని ముందుగా ఒక నటుడిగా స్థిరపడ్డాడు. అర్జున్ రెడ్డితో సరికొత్త బాక్సాఫీస్ హిట్ అందుకొని యూత్ లో తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు.
గత మూడేళ్ళ నుంచి ఈ యువ హీరో ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకి మరింత ఎక్కువవుతోంది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా క్రేజ్ అందుకుంటున్న విజయ్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మరోక న్యూ రికార్డ్ ను అందుకున్నాడు. 9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోగా నిలిచాడు. విజయ్ దేవరకొండ తరువాత అల్లు అర్జున్ 8.7మిలియన్స్ తో రెండవ స్థానంలో ఉన్నాడు.
విజయ్ సినిమాలు ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నప్పటికీ అభిమానులకు మాత్రం దూరంగా ఉండడం లేదు. ఎదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా వారికి కిక్కిచ్చే అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ఫిక్స్ అయినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సరికొత్త కాంబినేషన్ కి విజయ్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఎందుకంటే కనీసం ఆ కాంబో గురించి ఒక గాసిప్ కూడా రాలేదు. సడన్ గా చెప్పడంతో అభిమానులకు ఒక సర్ ప్రైజ్ లా అనిపించింది.