Jr NTR: మనది రక్త సంబంధం.. జన్మంటూ ఉంటే.. జూ. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

సుమారు ఐదు, ఆరు ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక పెద్ద థియేటర్ అయిన లాస్ ఏంజిల్స్ లోని ది థియేటర్ ఎట్ ఏస్ హోటల్ లో ప్రదర్శించగా స్టాండింగ్ ఓవేషన్ దక్కింది.

ఇక RRR సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో RRR చిత్రబృందం అమెరికాలో సందడి చేయగా.. అక్కడికి వెళ్లిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు భారీ స్వాగతం లభించింది.

గ్లోబల్ స్టార్ గా..

గ్లోబల్ స్టార్ గా..

బడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన నటన, ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని అనే సినిమాతో 2001లో హీరోగా తెరంగేట్రం చేసిన తారక్ ఆ తర్వాతి రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో మంచి హిట్ కొట్టాడు.

ఈ సినిమాతోనే డైరెక్టర్ గా రాజమౌళి పరిచయం అయ్యారు. అలా ప్రారంభమైన వీరిద్దరి ప్రయాణం నేడు RRR వరకు చేరింది. ఈ చిత్రంలో కొమురం భీమ్ గా నటించి తన నటనకౌశల్యాన్ని యావత్ ప్రపంచానికి రుచి చూపించాడు ఎన్టీఆర్. ఈ చిత్రంతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు తారక్.

తారకరత్న కారణంగా..

తారకరత్న కారణంగా..

ఇక RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12న జరగనున్న 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి RRR సినిమా బృందం హాజరుకానుంది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం ఈ వేడుక జరగనుంది.

అయితే ఇందుకోసం ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, కార్తికేయ అమెరికాలో పలు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నందమూరి తారక రత్న మరణం, పెద్దకర్మ కారణంగా వారితో ఎన్టీఆర్ వెళ్లలేకపోయిన విషయం తెలిసిందే.

తెలుగులో పెద్ద పదం..

అయితే తాజాగా అమెరికాకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరితో ఎన్టీఆర్ ప్రత్యేకంగా మాట్లాడరు. పేరు పేరున అక్కడున్న అభిమానులతో చర్చించారు. ఈ సందర్బంగా ఫ్యాన్స్ ను ఉద్దేశించి భావోద్వేగంగా వ్యాఖ్యలు చేశారు.

"మీరు చూపించే అభిమానానికి నా మనసులో మాట చెప్పడానికి తెలుగులో పెద్ద పదం కనిపించడం లేదు. మీ అభిమానానికి పదాలు కనిపెట్టలేదు. అయితే మనసులో ఒక మాట ఏంటంటే మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి వంద రెట్లు అభిమానం నా గుండెల్లో ఉంది. అది నేను చూపించలేకపోతున్నాను" అని తారక్ అన్నారు.

శిరస్సు వంచి..

జూనియర్ ఎన్టీఆర్ ఇంకా కొనసాగిస్తూ.. "మన మధ్య ఏ రక్త సంబంధం లేదు. నేనేం చేసి మీకు దగ్గరయ్యానో నాకు తెలియడం లేదు. మీరందరూ నా సోదరుల కంటే ఎక్కువ. మనది రక్త సంబంధం కంటే గొప్పదైన బంధం. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానే మాటను చెప్పగలను. మీ ప్రేమకు నేను రుణపడిపోయాను. ఇంకో జన్మంటూ ఉంటే ఈ అభిమానం కోసమే మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నాను" అని ఎమోషనల్ అయ్యారు.

తీక్షణంగా చూస్తున్న పులి బొమ్మ..

తీక్షణంగా చూస్తున్న పులి బొమ్మ..

ఇదిలా ఉంటే అభిమానులతో ముచ్చటించిన తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్ స్టా వేదికగా ఒక ఫొటో పంచుకున్నారు. అది కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఓ హౌజ్ లోని బాల్కనీ నుంచి దిగినట్లుగా తెలుస్తోంది. తీక్షణంగా చూస్తున్న పులి బొమ్మ ఉన్న టీ షర్ట్ ధరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చూసి RRR ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టేశాడని, ఏలేయాడానికి సిద్ధంగా ఉన్నట్లు సింబాలిక్ గా చెబుతున్నాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X