Jr NTR: అక్కడికి వస్తే బతకనిస్తారా.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్.. వందల కార్లతో ఘన స్వాగతం!

సుమారు ఐదారు ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. గతేడాది దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఈ సినిమాలో తారక్ నటన, పండించిన ఎమోషన్స్ కు యావత్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సోమవారం రోజున RRR నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తారక్ ఆస్కార్ వేడుకలకు ముందుగా అమెరికా వెళ్లాడు. అక్కడ ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

రెండో సినిమాతో..

రెండో సినిమాతో..

సినీ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబంలో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ తనదైన నటన, ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. 2001లో హీరోగా తెరంగేట్రం చేసిన తారక్ మళ్లీ అదే సంవత్సరం చేసిన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో మంచి విజయం సాధించాడు. ఈ సినిమాతోనే రాజమౌళి సినీ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ఒక్కసారిగా..

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ప్రారంభమైన రాజమౌళి, తారక్ ఫ్రెండ్ షిప్ నేటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి, యమదొంగ సూపర్ హిట్స్ కొట్టాయి. అలా స్టార్ట్ అయన వీరిద్దరి ప్రయాణం నేడు RRR వరకు చేరింది. ఈ చిత్రంలో కొమురం భీమ్ గా నటించి తన నటనకౌశల్యాన్ని యావత్ ప్రపంచానికి రుచి చూపించాడు ఎన్టీఆర్. ఈ చిత్రంతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు తారక్.

అర్ధరాత్రి నుంచే..

ఇక RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత ఎన్టీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నాడు. బుధవాం తెల్లవారు జామున హైదరాబాద్ లో అడుగుపెట్టాడు తారక్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ వస్తున్నాడని తెలియడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే విమానాశ్రయం వద్ద ఎదురు చూశారట.

ఆలస్యంగా ఎన్టీఆర్..

ఇక జై ఎన్టీఆర్ అనే నినాదాలాతో విమానాశ్రయం హోరెత్తిపోయింది. తారక్ ను ఎయిర్ పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకునేందుకు ఆయన సతీమణి ప్రణతి వచ్చారు. ఎన్టీఆర్, ప్రణతి కారులో వెళ్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మార్చి 12న జరగిన 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం కోసం RRR సినిమా టీమ్ ముందుగానే అమెరికా వెళ్లగా.. నందమూరి తారక రత్న మరణం, పెద్దకర్మ కారణంగా ఎన్టీఆర్ మాత్రం కాస్తా ఆలస్యంగా వెళ్లిన విషయం తెలిసిందే.

డల్లాస్ కు రావాల్సిందిగా..

ఆ సమయంలో అమెరికాకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరితో ఎన్టీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. పలువురు అటోగ్రాఫ్స్, ఫొటోగ్రాఫ్స్ తీసుకున్నారు. కొంతమంది ఫ్యాన్స్ కుటుంబ సభ్యులతోనూ వీడియో కాల్ మాట్లాడారు. అయితే అక్కడ ఉన్న ఒక అభిమాని తారక్ ను డల్లాస్ కు రావాల్సిందిగా కోరాడు. 'డల్లాస్ కా?.. బతకనిస్తారా? అక్కడికి వస్తే' అని ఎన్టీఆర్ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

అభిమాని సినిమా ఫంక్షన్ లో..

అభిమాని సినిమా ఫంక్షన్ లో..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చి సమాధానంతో అక్కడున్న వారంత నవ్వేశారు. ఇంతలో మరొక అభిమాని కలుగజేసుకుని 150 కార్లతో ఘన స్వాగతం పలుకుతామని చెప్పాడు. దీంతో వామ్మో అంటూ ఎన్టీఆర్ షాక్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలా బాగా వైరల్ అవుతున్నాయి. కాగా మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ అభిమాని అయిన విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సందడి చేయనున్నాడు తారక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X