RRR Oscar: అమెరికాలో ల్యాండ్ అయిన Jr NTR.. దిగగానే ఆ పని.. ఫొటో వైరల్
స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నాడు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే కొమురం భీమ్ గా నటించి తన నటనకౌశల్యాన్ని యావత్ ప్రపంచానికి రుచి చూపించాడు ఎన్టీఆర్.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఆస్కార్ వేళ RRR టీమ్ అమెరికాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికాకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ఓ ఫొటోతో క్యూరియాసిటీ పెంచాడు.

పాన్ వరల్డ్ రేంజ్..
వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దర్శక దిగ్గజం రాజమౌళి తరెకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా క్రేజీ హిట్ అందుకుంది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ను తీసుకొచ్చి పాన్ వరల్డ్ స్టార్‌ను చేసేసింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు..
జూనియర్ ఎన్టీఆర్ RRR (రౌద్రం రణం రుధిరం) సినిమాలో కొమరం భీమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటన, పలికించిన హావభావాలు, చూపించిన ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఈ సినిమా విడుదలైన అన్ని దేశాల్లోనూ తారక్ నటనకు అక్కడి ప్రేక్షకులు నీరాజనం పలికారు. అలాగే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

ఆస్కార్ వచ్చే..
ఇక యూఎస్ఏ టుడే (USA Today) పోర్టల్ ఆస్కార్ రేసులో నిలిచే టాప్ 10 హీరోల ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయగా.. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు టాప్ ప్లేస్ అంటే మొదటి స్థానం ఇచ్చింది. ఇలా ఇండియన్ యాక్టర్ ఎన్టీఆర్ కు టాప్ ర్యాంక్ ఇవ్వడం సెన్సేషన్ గా మారింది. దీంతో తారక్ కు ఆస్కార్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆశపడ్డారు తెలుగు ప్రేక్షకులు. కానీ చివరి నామినేషన్ ప్రక్రియలో ఎన్టీఆర్ కు చోటు దక్కకపోవడంతో నిరాశ చెందారు.

తారకరత్న మరణం కారణంగా..
నాటు నాటు ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇందుకోసం RRR టీమ్ అమెరికాలో సందడి చేస్తోంది. అమెరికాలో అవార్డ్ ఫంక్షన్స్ కు హాజరవుతూ బిజీగా ఉంది చిత్రబృందం. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, రాజమౌళి కొడుకు కార్తికేయ అమెరికాలో ఉన్నారు. అయితే అన్నయ్య తారకరత్న మరణం, పెద్ద కర్మ కారణంగా అమెరికాకు వెళ్లలేకపోయాడు జూనియర్ ఎన్టీఆర్.

అమెరికాలో దిగగానే..
ఇక నందమూరి తారకరత్న మరణానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో జూనియర్ ఎన్టీఆర్ సోమవారం అమెరికాకు పయనమైన విషయం తెలిసిందే. అయితే నేడు ఉదయం అమెరికాలో ల్యాండ్ అయిన తారక్ కాలిఫోర్మియా నుంచి ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వెనుక పులి బొమ్మ ఉన్న టీ షర్ట్ వేసుకున్న ఎన్టీఆర్ బాల్కనీలో నిల్చొని వెనుక నుంచి తీసిన పిక్ ను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు.
బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియాలో ఉన్నట్లు అందులో తెలిపాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారగా.. అమెరికాలో దిగగానే ఎన్టీఆర్ ప్రమోషన్స్ మొదలు పెట్టేశాడని అభిమానులు అనుకుంటున్నారు.
సింబాలిక్ గా చెబుతున్నట్లు..
తీక్షణంగా చూస్తున్న పులి బొమ్మ ఉన్న టీ షర్ట్ ధరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చూసి RRRతో ఏలేయాడానికి సిద్ధంగా ఉన్నట్లు సింబాలిక్ గా చెబుతున్నాడని మరికొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా హెచ్సీఏ రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించగా.. జూనియర్ ఎన్టీఆర్ ను సైతం అదే బహుమతితో గౌరవించనుంది. మార్చి 12న జరిగే ఆస్కార్ వేడుకల్లో RRR టీమ్ సందడి చేయనుంది.


Click it and Unblock the Notifications











